Sr NTR : ఎన్టీఆర్ కాషాయ దుస్తులు ధ‌రించ‌డం వెనుక ఏదైనా కార‌ణం ఉందా..?

Sr NTR : విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు నటుడిగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా స్టూడియో అధినేతగా…రాజకీయ వేత్తగా….ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించి తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. సినిమా నటుడిగా ఉంటూ తెలగు దేశం పార్టీ ( టీడీపీ) అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు ఉమ్మడి ఏపీలో తొలి కాంగ్రేసేతర సీఎంగా చరిత్ర సృష్టించారు .ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. కాషాయం దుస్తుల్లోనే కనిపించారు. ఆయన కాషాయ దుస్తులు వేసుకోవడం వెనక పెద్ద కథే ఉంది.

తిరుపతిలో జరిగిన ఓ సినిమా అవార్డ్ ఫంక్షన్‌లో ఎన్టీఆర్…తొలిసారి కాషాయ వేషధారణతో కనిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఎందుకు అలా వ‌చ్చారో అడిగే ధైర్యం ఎవ‌రు చేయ‌లేదు. అయితే ఆ అవార్డు ఫంక్షన్ తర్వాత విలేకరులు కొంత మంది ఆయన కాషాయ ఆహార్యంపై ప్రశ్నించారు. దానికి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఓ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా కలిచివేసినట్టు చెప్పుకొచ్చారు. అందుకే ఈ కాషాయ వేషధారణ అంటూ చెప్పుకొచ్చారు. ప్రాపంచిక సుఖాల‌కు అల‌వాటు ప‌డ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నా అని అందుకే ఈ గెట‌ప్ అని చెప్పారు.

Sr NTR kashayam dress what is the story behind it
Sr NTR

ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారిని చెరిచిన ఘ‌ట‌న త‌న‌ను క‌ల‌చివేసింద‌ని జీవితం ప‌ట్ల విర‌క్తి పుట్టింద‌ని కూడా ఎన్టీఆర్ తెలిపారు. స్వామి అగ్నివేష్ హైద‌రాబాద్ కు వ‌చ్చిన స‌మ‌యంలో ఎన్టీఆర్ సీఎంగా ఉండ‌గా, ఆయ‌న ద‌గ్గ‌ర నుండి కాషాయం గొప్ప‌త‌నం తెలుసుకున్నార‌ట‌. అప్ప‌టి నుండి ఎన్టీఆర్ కాషాయ దుస్తుల‌లో ఎక్కువ‌గా క‌నిపించే వారు. కాగా, స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ.. సన్యాసిగా ఉంటే ఎలాంటి స్వార్థం ఉండదు. మన కోసం కాకుండా సమాజం కోసం పనిచేయాలనే తపన మనలో మొదలవుతుందని ఎన్టీఆర్‌తో చెప్పారట.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago