OTT : ఇప్పుడు థియేటర్స్ కన్నా కూడా ఓటీటీలకి క్రేజ్ పెరిగింది. కరోనా సమయం నుండి ఓటీటీలకి ఆదరణ పెరగడంతో నిర్వాహకులు కూడా కొత్త రకం కంటెంట్‌తో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ వారం ఏఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అనే ఆసక్తి అందరిలో ఉంది. దీపావళి సందర్భంగా ఓటీటీ అభిమానుల్ని మరింత ఎగ్జైట్ మెంట్ కంటెంట్ తో అలరించడానికి రెడీ అవుతోంది. అక్టోబరు 20న సోనీ లివ్లో శర్వానంద్ హీరోగా నటించిన ‘ఓకే ఒక జీవితం’తో ఈ జోష్ మొదలవుతుంది. ఈసినిమా ఓటీటీ లో చక్కని మూవీగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార చిత్రం కూడా ఈ వారం ఓటీటీలోకి రానుంది. ఎప్పుడో రావలసి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఇప్పుడా డిలేని దాటుకుని రెట్టించిన ఉత్సాహంతో జీ5 లో అక్టోబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ చిత్రానికి కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఇక యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘కృష్ణ బృందా విహారి’ కూడా దీపావళి వారాంతంలో రాబోతుంది. ఈ కామెడీ డ్రామా అక్టోబర్ 21న నెట్ ఫ్లిక్స్ ల ప్రీమియర్ అవుతుంది. అలాగే బాలీవుడ్ ని ఓ పెన్సింగ్స్ షేక్ చేసి బ్రహ్మాస్త్ర మొదటి భాగం కూడా దీపాల పండుగకే కాబోతుంది.
బ్రహ్మస్త్రా చిత్రం అక్టోబర్ 23న డిస్నీ+ హాట్ స్టార్ లో స్ర్టీమింగ్ కి రెడీ అవుతోంది. వీటితో పాటు మరి కోన్ని తెలుగు చిత్రాలు కూడా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇవే కాక ఇతర భాషా చిత్రాలు కూడా దీపావళి సందడికి రెడీగా ఉన్నాయి. మరి థియేటర్స్‌లో పెద్దగా రాణించని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అయిన అలరిస్తాయా అన్నది చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…