Sonu Sood : రియల్ సోనూసూద్ పెద్దగా వివాదాల జోలికి పోరు. ఎప్పటికప్పుడు ఆయన పలు సేవా కార్యక్రమాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటారు. అయితే రియల్ హీరో సోను సూద్ కు రైల్వే శాఖ రీసెంట్‌గా వార్నింగ్ ఇచ్చింది. చాలామందికి రోల్ మోడల్ అయిన సోనూసూద్ ప్రమాదకరమైన చర్యలకు పాల్పడడం సరికాదని, గతంలో సోనూసూద్ కి సంబంధించిన రైల్లో ప్రయాణం చేస్తున్న ఒక వీడియోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. దేశంలోని, ప్రపంచంలోని లక్షలాది మందికి రోల్ మోడల్ అయిన మీరు రైలు ఫుట్ బోర్డు పై ప్రయాణం చేయడం ప్రమాదకరమని, ఈ రకమైన వీడియో మీ అభిమానులకు తప్పుడు సందేశాన్ని ఇస్తుందని, దయచేసి ఇలా చేయకండి అంటూ రైల్వే శాఖ పేర్కొంది.
ప్రశాంతంగా సురక్షితమైన ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి అంటూ ఉత్తర రైల్వేశాఖ సోషల్ మీడియా వేదికగా తన ట్వీట్‌లో పేర్కొంది. సోనూసూద్ డిసెంబర్ 13న ఈ వీడియో షేర్ చేయగా, దీనిపై ముంబై రైల్వే పోలీసు కమిషనరేట్ కూడా స్పందించింది. నిజజీవితంలో ఇలాంటి స్టంట్‌లు చేయొద్దంటూ సోనూసూద్‌కు సుతిమెత్తగా సూచించింది. ఇలా తనపై వస్తున్న విమర్శలపై సోనూసూద్ తాజాగా స్పందించారు. అందుకు క్షమాపణలు చెబుతూనే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను చూస్తూ అక్కడ అలా కూర్చుండిపోయాను. రైలు తలుపుల వద్దే మగ్గిపోతున్న లక్షలాది మంది పేదల జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచిస్తూ నేను అక్కడ కూర్చుకున్నాను.
మీరు సూచించిన సందేశానికి, రైల్వే వ్యవస్థ పనితీరును మెరుగుపరిచినందుకు ధన్యవాదాలు అంటూ సోనూసూద్ వినమ్రంగా ట్వీట్ చేస్తూ మరోసారి అభిమానుల మన్ననలు అందుకుంటున్నారు. కోవిడ్ సంక్షోభ కాలంలో తన సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల మనసు గెలుచుకున్న నటుడు సోనూసూద్ నేటికీ వాటిని కొనసాగిస్తూ రియల్ హీరోగా అందరి మెప్పు పొందుతున్నారు.
సోషల్ మీడియా ద్వారా కూడా ఎవరు ఎప్పుడు ఎలాంటి సాయం కోరిన కూడా వెంటనే స్పందిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…