Sharwanand : టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది.తనదైన నటన, విభిన్నమైన కథలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్… కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో మెరిసిన తర్వాత శర్వానంద్ హీరోగా మారి ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. రన్ రాజా రన్, శతమానం భవతి వంటి తదితర చిత్రాలతో హిట్ కొట్టిన శర్వానంద్ తర్వాతి కాలంలో వరుస పరాజయాలు చవిచూశాడు. ఇటీవల మాత్రం ఒకే ఒక జీవితం సినిమాతో మరో మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో ఎక్కువగా వినిపించే పేర్లు ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే.. మరొకటి శర్వానంద్.
ప్రభాస్, శర్వానంద్ ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా మీ పెళ్లి ఎప్పుడు అనే వార్త కచ్చితంగా ఉంటుంది. ఇక వీళ్ల పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అంతా ఇంతా కాదు. ఇటీవల శర్వానంద్ ఆహా వేదికగా ప్రసారమైన నందమూరి నటసింహం బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 సీజన్ కు అతిథిగా హాజరు కాగా, అందులో శర్వానంద్ పెళ్లి గురించి అడగ్గా.. ప్రభాస్ చేసుకున్న తర్వాత అని చెప్పి నవ్వించాడు. ప్రభాస్ ఏమో ఇంకా పెళ్లి రాత రాసిపెట్టలేదు సార్ అని సమాధానం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ తర్వాతే పెళ్లి అన్న రూల్ ను శర్వానంద్ఆ మాటలని బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.
శర్వా పెళ్లి పూర్తిగా అరేంజ్డ్ అని తెలిసింది. ఇంట్లో వాళ్లు, సన్నిహితులు కలిసి కుదిర్చిన సంబంధం అని టాక్. అమ్మాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తుందట. కరోనా కారణంగా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని సమాచారం. శర్వానంద్ ఎంగేజ్ మెంట్ ఈ నెల 26న జరుగుతుందని, ఇది పూర్తిగా ప్రయివేటు వ్యవహారంగా, అతి కొద్ది మందితో నిర్వహిస్తారట. త్వరలో డెస్టినేషన్ మ్యారేజ్ వుంటుంది. అది కూడా పూర్తిగా అతి కొద్ది మంది సన్నిహితులతో ఉంటుందని తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…