Chinmayi : సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. మహిళలని అవమానించేలా చిన్న సంఘటన జరిగినా చిన్మయి వెంటనే స్పందిస్తుంది. మీటూ ఉద్యమం చెలరేగినప్పుడు చిన్మయి తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైరాముత్తు తనని లైంగికంగా వేధించినట్లు చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. వైరముత్తుపై చిన్మయి తనవంతుగా పోరాడుతూనే ఉంది.
సందర్భం వచ్చిన ప్రతిసారి చిన్మయి వైరముత్తుపై ఏదో రకమైన కామెంట్స్ చేస్తూనే ఉంది. తాజాగా చిన్మయి.. వైరముత్తు వ్యవహారంలో ఏకంగా కమల్ హాసన్ ని టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేసింది. ఇండియన్ రెజ్లర్లు వేధింపులకు వ్యతిరేకంగా గత నెల రోజులకు పైగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజర్లర్లు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం తమ ఎంపీని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అటు రెజర్లర్లు మాత్రం నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా వారి నిరసన మీద కమల్ హాసన్ స్పందించాడు.
ఈ రోజుకు రెజ్లర్లు నిరసన చేస్తూ నెల రోజులు దాటేసింది.. వాళ్లు మన దేశ పతాకం కోసం పోరాడాలి.. కానీ వారిని వారు కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సి వస్తోంది.. అంటూ వారికే తన మద్దతు అని కమల్ హాసన్ ట్వీట్ చేశాడు.. ఈ ట్వీట్ మీద చిన్మయి మండి పడింది. తన బాధనంతా ట్వీట్ రూపంలో పెట్టేసింది. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించినందుకు తమిళనాడులో ఓ మహిళా సింగర్ 5 సంవత్సరాల పాటు నిషేదానికి గురైంది. ఈ సంఘటన వారి కళ్ళముందే జరిగింది కదా. కానీ ఆ రచయితతో ఉన్న పరిచయం కారణంగా దానిపై ఎవరూ స్పందించరు. తమ చుట్టూ జరిగే సంఘటనలని పట్టించుకోకుండా మాట్లాడే రాజకీయ నాయకులని ఎలా నమ్మాలి అంటూ చిన్మయి కమల్ హాసన్ ఉద్దేఇశిస్తూ ట్వీట్ ని పోస్ట్ చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…