Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!

Annapurnamma : సీనియ‌ర్ న‌టుడు న‌రేష్, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్ర ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మ‌ళ్లీ పెళ్లి అనే సినిమా రూపొందిన విష‌యం తెలిసిందే. సీనియర్ నటుడు వీకే నరేష్ సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తాను నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఆయన తల్లి విజయనిర్మల స్థాపించిన విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాని మే 26న విడుద‌ల చేశారు. ఇందులో పవిత్రా లోకేష్ ఆయనకు జంటగా నటించారు. వనితా విజయకుమార్ కీలక పాత్ర పోషించారు. జయసుధ అతిథి పాత్రలో నటించారు. తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ చిత్రాన్ని విడుద‌ల చేశారు. చిత్ర రిలీజ్‌కి ముందు హైదరాబాద్‌లో ‘మళ్ళీ పెళ్లి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న అన్న‌పూర్ణ‌మ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా టైటిల్‌ నాకు బాగా నచ్చింది. నాకు ఎం.ఎస్‌.రాజుగారు కథ చెప్పారు. ఇక ఎవరు ఏమనుకున్నా ఈ సినిమాను అందరూ తప్పకుండా చూస్తారు. సొసైటీ లో 90 ఏళ్ళు అయినా పెండ్లి చేసుకుంటున్న సందర్భాలున్నాయి. దానికి కారణం ఒంటరితనం భరించలేక పలకరింపు కోసమే అలా చేసుకుంటున్నారు. ఇప్పుడు యంగర్‌ జనరేష్‌ కొంత కాలం కలిసి వుండి ఆ తర్వాత పెండ్లి చేసుకుంటున్నారు. ఫైనల్‌ గా ఎప్పుడైనా మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిందే అని అన్నారు. ఒక‌వైపు వారి గురించి పాజిటివ్‌గా మాట్లాడుతూనే మ‌రోవైపు అన్న‌పూర్ణ‌మ్మ చుర‌క‌లు అంటించింది.

Annapurnamma satires on naresh and pavitra lokesh
Annapurnamma

ఇక ఈ ఈవెంట్‌లో జ‌య‌సుధ కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నరేష్, పవిత్రా లోకేష్ రిలేషన్‌షిప్‌పై వచ్చిన వార్తలు, సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడుతూ.. మన ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయం కన్నా పక్కింట్లో ఏం జరుగుతుందనే ఆసక్తే చాలా మందిలో ఉంటాయ‌ని జయసుధ చెప్పుకొచ్చారు. ఇక న‌రేష్ మాట్లాడుతూ.. రీల్‌ లైఫ్‌ బాగున్నా రియల్‌ లైప్‌ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ తర్వాత ఇంకో అమ్మను కలుసుకున్నా. పెండ్లి లో నమ్మకం, ఆప్యాయత, తోడును కోరుకుంటాం. వృద్ధాప్యంలో బలాన్ని కోరుకుంటాం. అందుకే చివరికి నా గమ్యానికి చేరుకున్నానని చెప్పగలను అని న‌రేష్ అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago