Shoaib Malik : క్రేజీ జంటగా ఉన్న సానియా మీర్జా – షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారనే వార్తలు శనివారం ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మాలిక్ తన కొత్త భార్య సనా జావేద్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రెండో పెళ్లిని నిర్ధారించడంతో అందరు షాకయ్యారు. దీంతో షోయబ్ – భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మధ్య సఖ్యత లేదని, ఇద్దరూ విడిపోబోతున్నారని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యింది. షోయబ్ మాలిక్ నుంచి సానియా మీర్జా ‘ఖులా’ ఎంచుకుందని ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ధ్రువీకరించారు. సానియా మీర్జా-షోయబ్ మాలిక్‌లు కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నారు. మరో వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్.. కొత్త ప్రయాణం బాగుండాలని సానియా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది” అని సానియా తరఫున ఈ ప్రకటన వెలువడింది.
సానియా మీర్జా వ్యక్తిగత విషయం, గోప్యతకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి అనవసరపు ఊహాగానాలు కల్పించవద్దని సానియా టీమ్ కోరింది. అయితే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పోస్ట్ చేసిన పాత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఒకటి బయటకు వచ్చిది. సనా జావేద్ మాజీ భర్త ఉమైర్ జైస్వాల్‌తో ఆయనకున్న స్నేహం గురించి ఈ పోస్ట్ తెలియజేస్తుంది. పోస్ట్‌లో సనా జావేద్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన షోయబ్ మాలిక్.. అప్పుడు ఆమె భర్త ఉమైర్ జైస్వాల్‌ను ట్యాగ్ చేశారు.దీంతో మాలిక్ జావేద్‌తో స్నేహం చేయడమే కాకుండా ఒక సంవత్సరం క్రితం తన భర్తతో కూడా మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉన్నాడని ఈ పోస్ట్‌ని బట్టి అర్ధమవుతుంది.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, షోయబ్ మాలిక్ సనా జావేద్‌తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసతూ.. ‘హ్యాపీ బర్త్‌డే’ స్టిక్కర్‌తో పాటు జావేద్ మరియు ఉమైర్ జైస్వాల్ ఇద్దరినీ ట్యాగ్ చేసాడు. దీనిని బట్టి అప్పట్లో ముగ్గురి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు అర్ధం అవుతుంది. గతేడాది వరకు సనా జావేద్ మాజీ భర్త ఉమైర్ జైస్వాల్‌తో షోయబ్ మాలిక్ స్నేహం కొనసాగించాడు. కాని ఏం జరిగిందో ఏమో కాని షోయబ్ మాలిక్, సనా పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది.పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా 2010లో ప్రేమ వివాహం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా వీరి వివాహం జరిగింది. 2018లో మీర్జా దంపతులుకు ఓ కుమారుడు జన్మించాడు. కొన్నేళ్ల పాటు సవ్యంగా సాగిన వీరి సంసారంలో మాలిక్ అక్రమ సంబంధం చిచ్చు రేపిందని వార్తలు వచ్చాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…