Hanuman Movie : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమా అని ముందు నుంచి అందరూ అనుకుంటూ వచిన సంక్రాంతి సినిమాలన్నింటిని బీట్ చేసి అందరిని ఆశ్చర్యపరచింది. నిజానికి ఈ సినిమా అనేక రికార్డులు కూడా బద్దలు కొట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండో భాగం పేరు జై హనుమాన్ కాగా ఆ సినిమాలో హనుమంతుడిగా నటించేది ఎవరు అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే హనుమాన్ సినిమా ఇంత మంచి విజయం సాధిస్తుందని ఎవరు ఊహించి ఉండరు.
బయ్యర్లకు హనుమాన్ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న నాన్ బాహుబలి రికార్డులను తుడిచి పెట్టేస్తోంది. అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుండగా, ఈ మూవీ టాలీవుడ్ లో ఉన్న నాన్ బహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా హనుమాన్ రికార్డులకెక్కింది. ఈ చిత్రం 11 రోజుల్లో రూ.112 కోట్ల గ్రాస్, రూ.209 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇప్పటివరకు అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా అల వైకుంఠపురం సినిమా పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది.
అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాకి మొత్తం రూ.75 కోట్ల లాభాలు రాగా, హనుమాన్ చిత్రం కేవలం 11 రోజుల్లోనే బయ్యర్లకు రూ.82 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. టాలీవుడ్ లో లాభాల పరంగా ఉన్న రికార్డులను చూస్తే.. అల వైకుంఠపురానికి ముందు ఆ రికార్డు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరిట ఉండేది. విజయ్ నటించిన గీతా గోవిందం సినిమాకి మొత్తం రూ.55 కోట్లు లాభాలు రాగా, రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకి కూడా లాభాలు దండిగానే వచ్చాయి. కానీ, ఆ మూవీని ఆ రోజుల్లోనే ఎక్కువ మొత్తానికి అమ్మడంతో కలెక్షన్స్ లో రూ.47 కోట్లు లాభాలు దక్కాయి. ఇప్పుడు ఈ రికార్డులు అన్నింటినీ ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రం తుడిచిపెట్టడం విశేషం. లాంగ్ రన్ లో ఈ రికార్డులు రూ.100 కోట్లు, రూ.120 కోట్లు దాటిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…