Venu Swamy : కోలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా వరుస ఆఫర్లతో నయనతార ఏ రేంజ్‌లో క్రేజ్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.ఇప్పటికీ ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే నయనతారకి మంచి క్రేజ్ ఉన్న సమయంలో ఈ అమ్మడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు . చూడ చక్కగా అన్యోన్య దాంపత్యం అంటే వీరిద్దరిని చూసి చాలా మంది అనుకున్నారు. అయితే ఇటీవల కొందరు వారి లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ అభిమానులని టెన్షన్ పెడుతున్నారు.
విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎల్.ఐ.సీ అనే సినిమా టైటిల్ కు సంబంధించి పలు వివాదాల్లో చిక్కుకుంది.జీవిత భీమా సంస్థ ఎల్.ఐ.సీ నుంచి విఘ్నేష్ శివన్ కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టైటిల్ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అని టైటిల్ మార్చమంటూ ఎల్ఐసి కంపెనీ వాళ్ళు కోర్టు ద్వారా నోటీసులు పంపారు . విషయం చాలా ముదరడంతో నయనతార ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఒక వార్త లీకై వైరల్ అవుతుంది. ఇంత పెద్ద ఇష్యూ జరిగాక అలాంటి సినిమాలో నటిస్తే ఎక్కడ తన క్రేజ్ పడిపోతుందో అనే భయంతో తన అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుందని టాక్. దీంతో నయనతార విఘ్నేష్ శివన్ మధ్య విభేదాలు తలెత్తాయని ఇద్దరు విడాకులు తీసుకోవడం ఖాయమని కొందరు చెబుతున్నారు.
నయనతార పెళ్లయ్యాక ఆమె చాలా వివాదాల్లో చిక్కుకుంది. పెళ్లయిన తర్వాత తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరిగి వివాదంలో చిక్కుకోగా… అలాగే కవల పిల్లల విషయంలో సరోగసి పద్ధతి వల్ల కూడా సమస్యలు తలెత్తాయి. ఇక ఇటీవల ఆమె నటించిన అన్నపూరిణి అనే మూవీ వల్ల కూడా నయనతార వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. కొంతమంది హిందువులు అయితే ఈమెపై కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఎల్ఐసీ వలన కూడా ఈమె ఇబ్బందులు పడుతుంది. తరచూ వీళ్లిద్దరూ ఏదో ఒక ఇబ్బందుల్లో పడుతూనే వస్తున్నారు. దాంతో వీరి పెళ్లి తర్వాత చిక్కుల్లో పడతారని చివరికి విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పింది జరుగుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…