Nara Lokesh : అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్‌..?

Nara Lokesh : అమెరికా పోలీసుల అదుపులో లోకేష్’ అన్న శీర్షికతో ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ వార్త చూసి ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులలో అలజడి నెలకొంది. ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే..టీడీపీ నాయకులలో మాత్రం ఆందోళన ఓ రేంజ్‌లో ఉంది. అయితే అస‌లు ఇందులో ఎంత నిజం ఉంది, అనే దానిపై సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చ న‌డుస్తుంది. అది ఫేక్ న్యూస్..కావాలని కొంతమంది సృష్టించినదే తప్పిస్తే దాంట్లో వాస్తవం లేదని సమాధానపర్చుకుంటున్నారు. అసలు సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులను షేక్ చేస్తున్న ఆ వార్తా కథనం ఏమిటనే విష‌యంపై ప్ర‌స్తుతం జోరుగా చర్చ న‌డుస్తుంది.

యువ గళం పాదయాత్ర ముగింపు తర్వాత లోకేష్ పెద్దగా కనిపించడం లేదు. అటు చంద్రబాబు ‘రా కదలి రా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సభలు నిర్వహిస్తుండ‌గా, దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ రాజకీయ కార్యక్రమాలేవీ కనిపించడం లేదు. దీంతో ఆయన అంతర్గత చర్చలు, వ్యూహాలకు పరిమితమవుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల పూర్తిగా కనిపించకపోయేసరికి లేనిపోని ప్రచారం ప్రారంభమైంది. యూఎస్ లో నిధుల సమీకరణలో భాగంగా.. హవాలా తరహాలో నగదును ఏపీకి తెచ్చి క్రమంలో యూఎస్ పోలీసులు లోకేష్ ను కస్టడీలోకి తీసుకున్నారని ప్రచారం ప్రారంభమైంది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఈ విషయాన్ని ట్రోల్ చేస్తోంది.

Nara Lokesh reportedly arrested by america police
Nara Lokesh

ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన కమ్మ ప్రముఖులు పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే లోకేష్ యూఎస్ వెళ్లి.. అక్కడి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారని ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని టిడిపి వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట లోకేష్ ను అబాసుపాలు చేయడానికి ఈ తరహా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. లోకేష్ ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యారని.. ఇప్పటికే చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచార సభలు నిర్వహిస్తుండడంతో.. క్షేత్రస్థాయిలో నెట్వర్క్ నడుపుతున్నారని.. ఇది చూసి తట్టుకోలేక వైసీపీ ఈ తరహా ప్రచారానికి దిగిందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే ఎన్నికల ముంగిట ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఎన్నెన్నో బయటకు వచ్చే అవకాశం ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago