Shivani Rajasekhar : రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ చిత్రంని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘లింగి లింగి లింగిడి’ అనే ఫోక్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడం మనం చూశాం.ఇటీవలే ఈ పాట 30 మిలియన్స్ వ్యూస్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్ సెలబ్రేషన్ నిర్వహించింది. 30 మిలియన్స్ కేక్‌ను ఈ సందర్భంగాకట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది చిత్రబందం. అయితే తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఆ కార్యక్రమంలో రాహుల్‌తో కలిసి శివాని తెగ రచ్చ చేస్తూ డ్యాన్స్ చేసింది. మాస్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. శివాని డ్యాన్స్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అమ్మడి డ్యాన్స్‌ని రివైండ్ చేసి మరీ చూస్తున్నారు.
ఇక నవంబరు 24న ప్రపంచవ్యాప్తంగా కోటబొమ్మాళి సినిమా విడుదల చేస్తున్నారు మేకర్స్. పోలీస్ కు రాజకీయనాయకుడికి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24న విడుదల కానుండంతొో ఈ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. తమిళంలో తాను నటించిన నెంజుకు నీది అనే సినిమా చూసి కోట బొమ్మాళి సినిమాలో దర్శకుడు తేజ మార్ని తనకి అవకాశం ఇచ్చాడని శివాని తెలిపింది. కోట బొమ్మాళి సినిమా కోసం శ్రీకాకుళం యాసను నేర్చుకున్నానని శివాని తెలిపింది.
తేజ డైరెక్షన్‌తో పాటు కాశీ నాగేంద్ర రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి అని నిర్మాత బన్నీ వాసు అన్నారు. చిత్రంలోను డైలాగ్స్ ద్వారా మాపై కాంట్రవర్సీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్‌లో జరిగే చాలా విషయాలు దగ్గర్నుంచీ చూసిన అనుభవం నాకుంది. వాటిలో నుంచి చాలా సెటిల్డ్‌గా ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తేజ ఈ సినిమాలో బాగా చూపించారు. ఎలక్షన్స్‌లో పాల్గొనే వారికి, పొలిటిషీయన్స్‌కు ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ప్రభావితం చేసేలా ఉంటుంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని రూపొందిచారు. సిస్టమ్ పాలిటిక్స్‌కు ఎలా లొంగిపోయిందనేది కాన్పెస్ట్ అని నిర్మాత తెలియజేయగా, ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…