PM Modi : వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ అదరగొడుతుందని, ట్రోఫీ కచ్చితంగా కొడుతుందని అందరు అనుకున్నారు. సెమీస్ వరకు వరుస విజయాలు అందుకున్న భారత్ ఫైనల్‌లో బొక్కబోర్లా పడింది. ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచిన భారత్ ఆ లక్ష్యం కాపాడుకోలేక ట్రోఫీని కోల్పోవలసి వచ్చింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకి నిరాశే మిగిలింది. మరోవైపు రోహిత్, విరాట్ లాంటి ఆటగాళ్లకి ఇది చివరి వన్డే వరల్డ్ కప్ కావడంతో వారు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత జట్టు ఓడిన తర్వాత.. ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌కు ప్రధాని మోదీ వెళ్లారు. క్రికెటర్లలో మనోస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భుజాలపై చేయి వేసిన మోదీ వారితో ముచ్చటించారు. ఇలాంటివి జరుగుతుంటాయని, మనోధైర్యాన్ని కోల్పోవద్దు అన్న సందేశాన్ని ఇచ్చారు. వరుసగా 10 మ్యాచ్‌లను గెలిచారని, మిమ్మల్ని కలవాలనిపించిందని, ఒక్క మ్యాచ్ ఓడిపోవడం సహజమే అని, మీరు నవ్వుతూ ఉండాలని, దేశం మిమ్మల్ని చూస్తోందని మోదీ చెప్పుకొచ్చారు. జడేజాతో మాట్లాడుతూ క్యా బాబూ అని పిలిచిన ప్రధాని.. నువ్వేదైనా గుజరాతీలో మాట్లాడు అని అన్నారు. షమీని దగ్గరకు తీసుకొని చాలా బాగా ఆడావని అతనికి కితాబు ఇచ్చారు. బుమ్రాతోనూ మాట్లాడుతూ నీకు గుజరాతీ వచ్చు కాదా అని అన్నారు.
టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారని, అందరు ఒక్కటి ఉండాలని, ఒకర్ని ఒకరు ప్రోత్సహించుకోవాలని, ఒకవేళ మీరు ఫ్రీగా ఉంటే, మనం ఢిల్లీలో ఓసారి కలుసుకుందాం అని ప్రధాని అన్నారు. ఢిల్లీకి రావాలంటూ క్రికెట్‌కు మోదీ ఆహ్వానం పలికారు.షమీ తన సోషల్ మీడియాలో మోడీని కౌగిలించుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోతో పాటు క్యాప్షన్‌లో, డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరిచినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపాడు. భారత జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా ప్రధాని మోదీతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. టీమ్ ఇండియా టోర్నీ ఆసాంతం బాగా ఆడిందని, అయితే ఫైనల్స్‌లో జట్టు రాణించలేకపోయిందంటూ జడేజా రాసుకొచ్చాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…