Barrelakka : బ‌ర్రెల‌క్క‌పై, త‌మ్ముడిపై దాడి.. చంపేస్తారేమోన‌ని భ‌య‌మేస్తుందంటూ కామెంట్

Barrelakka : తెలంగాణ‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌చారాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఇక కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష కోసం అన్ లైన్ లో స్వచ్చందంగా ప్రచారం చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో నిరుద్యోగి శిరీషా తెలంగాణ వార్తల్లోకి ఎక్కింది. బర్లు కాసుకుంటున్న వీడియోతో బర్రెలక్కగా పేరొందిన శిరీషా అనూహ్యంగా నిరుద్యోగుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ద‌మైంఇ. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీలోకి దిగారు.

శిరీషాకు కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించారు. తనను తాను బర్రెలక్క గానే ప్రమోట్ చేసుకుంటున్నారు శిరీష. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నిరుద్యోగి శిరీషా తనకు ఒక్కసారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని, భవిష్యత్ ను మారుస్తానని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆన్ లైన్ లో ఆమెకు మద్దతుగా ప్రచారం పెరుగుతోంది. పోలింగ్ నాటికి సునామీ అయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆమె తమ్ముడిపై దుండగులు దాడి చేశారు.

Barrelakka incident she is facing problems
Barrelakka

తన తమ్ముడిపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని బర్రెలక్క కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రజల మద్దతు పెరగడంతో ఓట్లు చీలిపోతాయని ప్రత్యర్థులు ఇలా దాడులు చేయించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. తన తమ్ముడిపై దాడి చేసి గాయపపర్చడం దుర్మార్గమంటూ భోరున విలపించారు. యువత, నిరుద్యోగుల తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నానని ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బర్రెలక్క. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఆమె కోరారు. ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసిన వెనక్కి త‌గ్గేది లేద‌ని బ‌ర్రెలక్క చెబుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago