Anushka Shetty : పూరీ జ‌గ‌న్నాథ్‌ని మోసం చేశాను అని ఓపెన్‌గా చెప్పేసిన అనుష్క‌

Anushka Shetty : హీరోలకి స‌మానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న అందాల ముద్దుగుమ్మ అనుష్క‌. టాలీవుడ్ జేజమ్మగా పేరు తెచ్చుకుని అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పునాది వేసింది అనుష్క‌నే అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చాలా కాలం పాటు వెలుగు వెలిగింది. రీసెంట్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా సోషల్ మీడియాలో అనుష్కకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అనుష్క తనకు హీరోయిన్ గా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? పూరి జగన్నాథ్, నాగార్జున తనను ఎలా సపోర్ట్ చేశారు? అనే అంశాల గురించి చెప్పుకొచ్చింది.

హీరోయిన్ కాక‌ముందే అనుష్క యోగా టీచ‌ర్‌గా చేసింద‌నే విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఈ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. యోగ టీచర్ గా ఆరు సంవత్సరాలు పనిచేశానని, యోగ మీద ఉన్న ప్యాషన్ తోనే పనిచేశాను తప్ప డబ్బు కోసం కాదని, నా జీవితంలో నేను ఎప్పుడూ డబ్బుకి ప్రయారిటీ ఇవ్వలేదని పేర్కొంది. మీకు హీరోయిన్‌గా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? అని అడగగా.. “పూరి జగన్నాథ్ వల్ల వచ్చింది. ఇండస్ట్రీ పర్సన్ అయిన నివాస్ వైఫ్, నేను మంచి యోగా ఫ్రెండ్స్. నివాస్ తో పాటు శ్రీను అని ఉండేవారు. ఆయన పూరి జగన్నాథ్ ని కలవమని చెప్పారు. ఒక సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్నారు అని చెప్పి ఫోన్ చేయమని నాతో అన్నారు.

Anushka Shetty sensational comments on puri jagannadh
Anushka Shetty

కానీ నాకు చాలా సిగ్గు. శీను నాకు కాల్ చేయమని అన్నారు. కానీ నేను ఆ విషయంలో పూరి జగన్నాథ్ ని చీటింగ్ చేశాను. ఎందుకంటే నేను కాల్ చేయలేదు. ఆ సమయంలో శ్రీను కాల్ చేసావా? అని అడిగితే చేశాను అని చెప్పాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళందరూ నేను తప్పించుకుంటున్నానని అర్థం చేసుకొని వాళ్లే.. నన్ను పూరి జగన్నాథ్ తో కాల్ చేయించారు అని పేర్కొంది. నిజం చెప్పాలంటే నేను సినిమాలు పెద్దగా చూడను. టీవీ కానీ, మూవీస్ కానీ అలవాటు లేవు. అప్పుడు పూరి జగన్నాథ్ ని కలిశాను. సో ఒక మూవీ ఉందని చెప్పారు.

అప్పుడు ఫోటో ఉందా? అని అడిగారు. దాంతో ఉందని, నా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసి ఇచ్చాను. అప్పుడు పూరి ఆ ఫోటో చూసి ఆ తర్వాత నా ఫేస్ చూసి నవ్వారు. ఆ తర్వాత సరే నేను కాల్ చేస్తాను అని చెప్పి వెళ్లిపోయారు. నెక్స్ట్ డే కాల్ చేసి నువ్వు హైదరాబాద్ రావాలి అని అన్నారు. ఆ టైంలో నాకు యోగ క్లాసెస్ ఉండ‌డంతో శ‌నివారం వ‌స్తాను అని చెప్పాను. శుక్ర‌వారం కాల్ చేస్తే వెళ్లాను. లుక్ టెస్ట్ చేశారు. ఆ టైంలో నాతో పాటు ఇంకో హీరోయిన్ కూడా వచ్చింది టెస్ట్ అయ్యాక ఫోటో షూట్ కూడా చేశారు. ఇవన్నీ చూసి మన వల్ల కాదని వెళ్లిపోవాలని అనుకున్నాను. కానీ ఆ తర్వాత నాగార్జున నన్ను చూసి ఈ అమ్మాయిలో ఏదో ఉంది అని నన్ను సెలెక్ట్ చేశారు” అని పేర్కొంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago