Allu Sneha Reddy : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న హీరో. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ మరింత పెరిగింది.పుష్పరాజ్‌గా తనదైన మేనరిజంతో సందడి చేశాడు. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకున్నాడు. 2011లో స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు బన్నీ. వారి ప్రేమ బంధానికి గుర్తింపుగా అల్లు అయాన్, అల్లు అర్హ పుట్టారు. బన్నీ ప్రస్తుతం సినిమా లైఫ్‌తో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి టూర్స్ వేస్తుంటాడు. అలానే ఖాళీ దొరికినప్పుడల్లా పిల్లలతో, భార్యతో తెగ సందడి చేస్తుంటాడు. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి ఇటీవలి కాలంలో హీరోయిన్స్ కి మించి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
బన్నీ భార్యగా కాకుండా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తన భర్త కోట్లు సంపాదించేలా ఉన్న కూడా స్నేహారెడ్డి తనకంటూ ఓ కెరియర్ కోసం ప్రాకులాడుతుంది. మనిషిగా పుట్టాక ఒక పని సంపాదన, లక్ష్యం మనకంటూ ఒకటి ఉండాలని ఆమె భావిస్తున్నారు. ఇక స్నేహ రెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇక స్నేహ రెడ్డి హెల్త్ మరియు ఫిట్నెస్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందుకే ఆమె ఇద్దరు పిల్లలకి తల్లి అయిన కూడా చాలా యంగ్‌గా కనిపిస్తూ ఉంటుంది. స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య క్రమేపి పెరుగుతూ పోతుంది.
ఇక స్నేహా రెడ్డి ఎప్పటికప్పుడు తన పిల్లలతోనో లేదంటే భర్తతో సందడి చేస్తున్న పిక్స్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన కూతురు అర్హతో కలిసి సందడి చేస్తున్న వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తల్లి కూతుళ్లు చాలా బాగున్నారు అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిన్న అల్లు అర్హ ఏడవ పుట్టిన రోజు కావడంతో బన్నీ కొన్ని ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.ఇటీవలే వరుణ్ పెళ్లి నుంచి అర్హవి కొన్ని క్యూట్ ఫోటోలు స్నేహ కూడా షేర్ చేశారు . అలాగే వరుణ్ పెళ్ళిలో అర్హని ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. నా లిటిల్ ప్రిన్సెస్ కి బర్త్ డే విషెష్ అంటూ పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. కాగా, అర్హ శాకుంతలం సినిమాతో వెండితెరపై సందడి చేసిన విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…