Surya Kumar Yadav : వన్డే ప్రపంచకప్ వైఫల్యంతో భారత క్రికెట్ లో కొందరి శకం ముగిసినట్టు ప్రచారం జరుగుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు శకం మరి కొద్ది రోజులలో ముగిసినట్టేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్య కుమార్ యాదవ్ పేరు కూడా యాడ్ అయింది. టీ20లలో వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్… ప్రపంచకప్ ఫైనల్లో దారుణమైన ప్రదర్శన చేశాడు. టీ20లలో మెరుపు ఆటతో వన్డేలలో చోటు దక్కించుకుంటున్న సూర్య.. ఈ మెగా టోర్నీలో చేసింది మాత్రం ఏమి లేదు. వరల్డ్ కప్‌తో వన్డేలకు పనికిరాడన్న ట్యాగ్‌ను మరింత పదిలం చేసుకుంటూ అతడి వైఫల్యం సాగింది. అయితే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో చివరి రెండు టీ20లకు శ్రేయర్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొదటి మూడు టీ20లకు అతడికి విశ్రాంతి ఇచ్చారు. అక్షర్ పటేల్ సహా ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్ తదితర ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో అద్భుతంగా రాణించి, ఫైనల్‌ను పరాజయంతో ముగించిన టీమిండియా.. నవంబర్ 23 నుంచి విశాఖపట్నం వేదికగా సాగే తొలి టీ20 మ్యాచ్‌తో ఆస్ట్రేలియాని ఢీకొట్టనుంది.అయితే వరల్డ్ కప్ లో అట్టర్ ఫ్లాప్ అయిన సూర్యకుమార్ యాదవ్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మెగాటోర్నీలో చెత్తాట ఆడిన సూర్యకు కెప్టెన్సీ ఎలా ఇస్తారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఈ మెగాటోర్నీలో 7 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, 17 యావరేజ్‌తో 106 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 49 పరుగులు మినహా… మిగిలిన మ్యాచుల్లో 25+ పరుగులు కూడా చేయలేకపోయాడు సూర్యకుమార్ యాదవ్.. ఫైనల్ లో అయితే..36వ ఓవర్ లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. టీ20 స్టైల్ లో ఆడతాడనుకుంటే జిడ్డు బ్యాటింగ్ తో విసిగించాడు. ఆఖరి 10 ఓవర్లలో పరుగులు చేయాల్సిన సూర్య.. బౌండరీలు ఆడడం రానట్టుగా బ్యాటింగ్ చేశాడు.డెత్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్ క్రీజులోకి వచ్చిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ సింగిల్స్ తీస్తూ కాలక్షేపం చేశాడు. తన కంటే కుల్దీప్ యాదవ్ బాగా ఆడతాడన్నట్టుగా స్ట్రైయిక్ రొటేట్ చేయడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. చివరికి 28 బంతులు ఆడి ఒకే ఒక్క ఫోర్ బాది 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇలా మెగాటోర్నీలో నిరాశపర్చిన ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…