Shiva Krishna : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ గురించి ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు సమాచారం.ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత క్యూరియాసిటిని పెంచేసాయి.. ఈ చిత్రానికి అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో ప్రచారాలు జరుగుతున్నాయి.
ఇక మహేష్.. డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కనుండగా ఈ మూవీ. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమాతో మహేష్ పాన్ ఇండియా స్టార్‌గా మారనున్నాడు. మహేష్ 5 సంవత్సరాల వయసులో నీడ అనే చిత్రంతో తెరంగేట్రం చేసాడు. బాల్యనటుడిగా తన తండ్రితోపాటు 7 చిత్రాలకు పనిచేసిన మహేష్ బాలచంద్రుడు సినిమాలో ప్రధాన పాత్రలో పోషించి అలరించడు. తరువాత తిరిగి సోలో హీరోగా 1999లో ప్రిన్స్ మహేష్ బాబుగా రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి వంటి సినిమాలు మహేష్ ని టాప్ హీరోగా నిలబెట్టాయి.
మహేష్ బాబుని ఇష్టపడని ఆర్టిస్టులు వుండరు అంటే అతిశయోక్తి కాదు. అతను ఎవరితో ఎక్కువగా వివాదాలు పెట్టుకోడు. ఇటీవల అతని గురించి ఓ మీడియా వేదికగా సీనియర్ యాక్టర్ శివ కృష్ణ గారు మాట్లాడుతూ… మహేష్ బాబు బోర్న్ ఆర్టిస్టు అంటూ ఆకాశానికెత్తేశారు. మహేష్ బాబుని చిన్నప్పుడే తన మేనేజర్ ద్వారా చూసిన శివ కృష్ణ అతను ఫ్యూచర్ సూపర్ స్టార్ అవుతాడని జోశ్యం చెప్పాడట. ఇప్పుడు అంతకు మించి అన్న రేంజ్‌లో మహేష్ ఎదిగాడు. ఇప్పుడు అతనిని చూసి ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…