Simhadri : ఇటీవల ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ వచ్చింది. హీరోల బర్త్ డేల సందర్భంగా గతంలో హిట్ అయిన సినిమాలని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకొని సింహాద్రి చిత్రం రీ రిలీజ్ చేశారు. అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ డం అందుకున్న తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది. మూవీ భారీ వసూళ్లని రాబడుతుందని అనుకున్నారు. కాని పవన్ రికార్డుని మాత్రం చెరిపేయలేకపోయింది. ఫ్యాన్స్. ట్రేడ్ వర్గాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ మూవీస్ టాప్ డే 1 కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఖుషి 3.62 కోట్లు, సింహాద్రి4K 2.90 కోట్లు, జల్సా 2.57 కోట్లు, ఒక్కడు 1.90 కోట్లు, పోకిరి 1.52 కోట్లు, దేశముదురు 1.46 కోట్లు, ఆరెంజ్ 1.42 కోట్లు, బిల్లా 85 లక్షలు, చెన్నకేశవరెడ్డి 64 లక్షలు, వర్షం4K 15 లక్షలుగా ఉంది.
ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ సింహాద్రి సినిమా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 5.2 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్లు ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. దీంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర మూవీ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్ట్ ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకుంది. ఇక పోస్టర్ షేర్ చేస్తూ జూనియర్‌కి అందరు ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఒక లేఖ విడుదల చేశారు. మంచైనా, చెడైనా.. ఎప్పుడూ అండగా ఉంటూ వస్తోన్న ఫ్యాన్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.
గత కొన్ని దశాబ్దాలంగా ఫ్యాన్స్ ఎంతో అండగా ఉన్నారని.. కష్ట సమయాల్లో నా అభిమానులే నాకు బలమైన మద్దతును ఇచ్చారని తెలిపారు. నేను పోషించిన ప్రతి పాత్ర మరియు నేను భాగమైన ప్రతి కథ నా అభిమానుల కోసం! నా సినిమాలను ఆదరించినందుకు, నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ పేర్కోన్నారు.ఇక ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2022 మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…