Salaar : బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ ఇలా వరుస చిత్రాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆది పురుష్’ చిత్రం జూన్ 16 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది మూవీ టీం.ఈ చిత్రానికి కంటే కూడా ప్రభాస్ అభిమానుల నుండి ప్రేక్షకుల వరకు ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’. ప్రభాస్ ని మాస్ లుక్‌లో చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌ని అలా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
ప్రస్తుతం సలార్‌ఖి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అయితే చిత్రంలోని యాక్షన్ సీన్‌ని రూపొందించడానికి టీమ్ 35 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది అని తెలుస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. జగపతి బాబు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు, ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేశారట.ఇక ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల కాబోతుంది అంటూ గత కొంత కాలం నుండి ప్రచారం అవుతున్న వార్త.
అయితే అందులో నిజం లేదని కొందరు అంటున్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోందని అంటున్నారు. ఏకంగా 400 మంది రౌడీలతో ఈ క్లైమాక్స్ ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లోనే ప్రభాస్ రెండో క్యారెక్టర్ కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందట. అందుకే, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వండర్స్ ని క్రియేట్ చేస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. మొత్తమ్మీద ఈ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. కాగా ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా భారీగా కసరత్తులు చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…