Anchor Shyamala : నా భ‌ర్త మంచివాడు.. నా చేతి భోజ‌నం తిన్న ఆమెనే న‌న్ను మోసం చేసింది..

Anchor Shyamala : యాంక‌ర్ శ్యామ‌ల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అంత అందాలు ఆర‌బోయ‌క‌పోయిన కూడా మాటల గారడితో ఇట్టే ఆకట్టుకుంటుంది. అటు సినిమాల్లోనూ అడపా దడపా నటిస్తూ బుల్లితెర‌పై కూడా సంద‌డి చేస్తుంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్యామల కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. ఆపై సినిమాల్లో ట్రై చేసినా.. పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఈ సమయంలో బుల్లితెరపై యాంకర్‌గా మారి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించింది . సినిమాల ప్రమోషన్ కోసం సుమ కాకుండా నెక్ట్స్ ఆప్షన్ ఎవరంటే… శ్యామల పేరే చెబుతున్నారు . అయితే శ్యామలకు పెళ్లైందా…? పిల్లలున్నారా అనేది కొంద‌రికి డౌట్. అయితే అబ్బాయిల హార్ట్ బ్రేక్ అయ్యే విషయం ఏంటంటే.. ఆమెకు ఎప్పుడో పెళ్లైయ్యింది. ఒక బాబు కూడా ఉన్నాడు.

ప్రముఖ సీరియల్ యాక్టర్.. నరసింహారెడ్డి శ్యామల భర్త కాగా, ఈమె ప్రజంట్ తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూనే… ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతుంది. శ్యామ‌ల బిగ్ బాస్ హౌజ్‌లోను తెగ సంద‌డి చేసింది. అయితే క‌రోనా సమయంలో శ్యామల భర్త నరసింహారెడ్డి గురించి ఓ వార్త సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే ఈయన ఒక మహిళ దగ్గర దాదాపు కోటి రూపాయలకు పైగా డబ్బు తీసుకొని అప్పు చెల్లించమని అడిగితే తనని బెదిరిస్తున్నారని ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ‌గా,ఈ విష‌యం అప్పుడు హ‌ట్ టాపిక్‌గా మారింది.

Anchor Shyamala interesting comments on her life
Anchor Shyamala

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామ‌ల ఆ విష‌యాల‌పై క్లారిటీ ఇచ్చింది. మా ఆయన పై కేసు పెట్టిన మహిళ మరెవరో కాదని తను నాకు బాగా తెలిసిన వ్యక్తి అని శ్యామల తెలిపారు.తను ప్రతిరోజు మా ఇంట్లోనే మేము చేసిన వంట తింటూ మాతో చాలా మంచిగా ఉండేది అయితే ఆమె నా భర్త పై ఇలా అనవసరంగా చీటింగ్ కేసు పెట్టారని అయితే త‌ర్వాత‌ అది అబద్ధం అంటూ రుజువైందని శ్యామల చెప్పుకొచ్చింది. నేను చేసిన వంట తింటూ మాకే వెన్నుపోటు పొడిచింది అని చెప్పి శ్యామ‌ల బాధ‌ప‌డింది. నా భ‌ర్త తన పని తాను చేసుకుంటూ పోతారని చివరికి నా ప్రోగ్రామ్స్ విషయంలో కూడా ఆయన అస‌లు జోక్యం చేసుకోరని,తన భర్త ఎవరిని చీటింగ్ చేసే వ్యక్తి కాదు అంటూ శ్యామ‌ల స‌ర్టిఫికెట్ ఇచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago