Shaakuntalam : సమంత, దేవ్ ప్రధాన పాత్రలలో గుణశేఖర్ తెరకెక్కించిన విజువల్ వండర్ శాకుంతలం. విజువల్ వండర్ అంటూ విడుదలకు ముందు వర్ణించిన శాకుంతలం సినిమాకు అదే మైనస్ అయిపోయింది. సినిమా చూస్తుంటే కళ్లకు స్పష్టంగా ఇది వీఎఫ్‌ఎక్స్ అని అర్ధమైంది. అసలు గుణశేఖర్ టేకింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడకుంటే అంత మంచిది. ఒక్కడు, రుద్రమదేవి లాంటి సినిమాలను తెరకెక్కించిన గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడా అని అందరు నోరెళ్లపెడుతున్నారు. ఏ ఒక్కటి కూడా సినిమాని బతికించలేకపోయాయి. తొలిరోజు ఏమంత కలెక్షన్‌లు రాబట్టలేకపోయిన ఈ సినిమా.. రెండవ రోజు కాస్త గ్రోత్ ఉందనుకుంటే రెండో రోజు మరింత దారుణంగా కలెక్షన్‌లు సాధించింది.
ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేలోపు పట్టుమని పది కోట్ల గ్రాస్ కూడా ఈ సినిమా కలెక్ట్ చేయలేకపోయింది. అయితే సమంత నటించే హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలు మంచి వసూళ్లు వస్తుంటాయి. సమంత నుంచి చివరగా వచ్చిన యశోద చిత్రం మంచి విజయం దక్కించుకుంది. అయితే సమంత సోలో చిత్రాలు ఎప్పుడూ 50 కోట్ల మార్క్ దాటలేదు. అయితే గుణశేఖర్ సమంత క్రేజ్ ని నమ్ముకుని శాకుంతలం చిత్రానికి 80 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని కొందరు అనుకుంటున్నారు. కొందరు ఈ చిత్ర బడ్జెట్ 50 కోట్లే అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా శాకుంతలం 3 రోజుల షేర్ కనీసం 10 కోట్లు కూడా దాటలేదు.
రోజు రోజుకి సినిమా కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అవుతుండడంతో ఈ మూవీని పెద్ద డిజాస్టర్‌గా చెబుతున్నారు. గుణశేఖర్ వల్లనే ఈ సినిమా అంత దారుణంగా నిరాశ పరచిందని అంటున్నారు .శాకుంతలంలో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి గ్రాఫిక్స్ కార్టూన్ ని తలపించాయి. దీనితో రాను రాను ఈ చిత్రంపై ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు తొలి షో నుండే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో థియేటర్స్ కి వెళ్లే జనాల సంఖ్య కూడా తగ్గింది. సినిమా విడుదల రోజు కనిపించిన గుణశేఖర్.. ఇప్పటివరకు మళ్లీ కనిపించలేదు. సమంత సైతం సైలెంట్ అయిపోయింది. యునానిమస్‌గా ఈ సినిమా తిరస్కారానికి గురి కావడంతో ఎవరూ ఏమి పెద్దగా మాట్లాడడంలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…