Chittibabu : సమంత అక్కినేని కోడలిగా ఉన్నప్పుడు ఆమెకి అందరికి చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎప్పుడైతే చైతూ నుండి విడిపోయిందో చాలా విమర్శలు ఎదుర్కొంటుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ హిట్‌తో ఒక్కసారిగా హిందీలో కూడా పాపులర్ అయిన సామ్ ఈ సిరీస్ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ వస్తుంది. కాకపోతే ఆమె చేసే సినిమాలపై దారుణంగా ట్రోలింగ్ నడుస్తుంది. తాజాగా సమంత నటించిన శాకుంతలం దారుణమైన ఫ్లాప్ కావడంతో సమంతని ఓ వర్గం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మీడియాతో సమంతపై నిర్మాత చిట్టిబాబు కామెంట్ చేయటం అంతటా చర్చనీయాంశంగా మారింది.
సమంత అనారోగ్యం వల్ల ముఖం పీక్కుపోయిందని అందుకనే ఏదేదో చేస్తుందని, తాను చనిపోయే లోపు ఇలాంటి పాత్రలు చేయాలని భావిస్తున్నాను అంటూ రకరకాల సినిమాలు సెట్ చేసుకుంటూ వెళుతుందని చిట్టిబాబు ఆరోపిస్తున్నారు. ఆ అమ్మాయి, ప్రతి సినిమా ముందు ఇలాంటి సెంటిమెంటల్ డ్రామాలు క్రియేట్ చేస్తూ వస్తోందని యశోద సినిమా సమయంలో కూడా డబ్బింగ్ చెబుతున్నట్లుగా ఉన్న ఫోటో రిలీజ్ చేసిందని నిజానికి ఒకప్పుడు హై ఫీవర్ తో ఉండి నటించిన వారు కూడా ఎంతోమంది ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
హీరోయిన్ గా ఆమె కెరీర్ కూడా అయిపోయిందని ఈ సందర్భంగా చిట్టిబాబు పేర్కొన్నారు. కెరీర్ అయిపోయింది కాబట్టే ఇప్పుడు తాను చేసిన సినిమాలను ఏదో ఒక సెంటిమెంట్ ప్లే చేసి హిట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.. ఈ అమ్మాయి డ్రామా సెంటిమెంట్ క్రియేట్ చేస్తోందని దీనివల్ల సానుభూతి పొంది సినిమాలు హిట్ చేసుకోవాలని చూస్తుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. చిట్టిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు ఆమె చాలా అద్భుతమైన సౌందర్యరాశి కానీ అనేక రకాల జబ్బుల బారిన పడి ఆమెకు ముసలి ముఖం వచ్చేసిందని చిట్టిబాబు పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…