Samantha : టాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన సమంత చివరిగా శాకుంతలం చిత్రంతో పలకరించింది. స్టార్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 30 న విడుదలై మిశ్రమ స్పందనను పొందుతుంది. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ మూవీకు అనుకున్నంతగా ఆదరణ లభించడం లేదు. దీంతో మూమీ టీమ్ తో పాటు నటి సమంత కూడా విమర్శలు ఎదుర్కొంటుంది. గత కొన్ని రోజులుగా సమంతపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు కూడా వచ్చాయి. డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని, స్టార్ డమ్ పడిపోయిందని అనేక విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సమంత ‘శాకుంతలం’ నెగిటివ్ రిజల్ట్ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేయగా, ఇప్పుడు ఇది హట్ టాపిక్ గా మారింది.
మంగళవారం సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని పోస్ట్ చేసింది. కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతూర్భూ మా తే సంగోత్సవ ఆకర్మణి అంటూ సమంత ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. కర్మ చేయడానికే మాత్రమే కానీ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలను చేయడం మనకు అని ఈ శ్లోకం అర్థం. శాకుంతలం రిజల్ట్‌ను ఉద్దేశించి సమంత ఈ పోస్ట్‌ను పెట్టినట్లుగా నెటిజన్లు అభిప్రాయపడుతోన్నారు. సినిమా రిజల్ట్ అన్నది తన చేతులో లేదని, ఈ రిజల్ట్‌కు తాను బాధ్యురాలిని కాదని సమంత ఈ పోస్ట్ ద్వారా పేర్కొన్నట్లు కొందరు చెబుతున్నారు.
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ప్రేరణతో ఈ మూవీను తెరకెక్కించారు దర్శకుడు గుణశేఖర్. స్క్రిప్ట్ పరంగా ఈ మూవీ బాగానే ఉన్నా దాన్ని తెరపైన చూపించడంలో దర్శకుడు విఫలమయ్యారని తెలుస్తుంది. ఈ మూవీ విడుదల రోజు నుంచే విమర్శలు మొదలైయ్యాయి. కథ, కథనం, గ్రాఫిక్స్ వర్క్ పై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సమంత నటన పై కూడా కాస్త వ్యతిరేకత వచ్చింది. వెరసి ఈ సినిమా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. సమంత డబ్బింగ్ కూడా సినిమాకి మైనస్ అని అంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…