Shaakuntalam Collections : విజువల్ గ్రాండియర్ గా తెగ పబ్లిసిటీ చేస్తూ వచ్చిన శాకుంతలం ఫలితం మాత్రం ప్రతి ఒక్కరికి తీరని నిరాశ మిగిల్చింది. సినిమాకి ముంఉద ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రచారం చేశారు. మూవీ బాహుబలిని మించి పోతుంది అనేలా మేకర్స్ చెప్పుకొచ్చారు. కాని తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఈ మూవీ దారుణంగా విమర్శలు మూటగట్టుకుంది. సుమారుగా మూడేళ్ళ నుండి తెరకెక్కుతున్న సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు.గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా అనిపించాయి. ఈ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారంటే నమ్మశక్యంగా ఉండేట్టు ఎవరికీ అనిపించలేదు.
ఇక విడుదల తర్వాత కూడా ఆడియన్స్ లో అలాంటి అనుభూతి కలిగింది.ఇండస్ట్రీ లో లెజండరీ స్థానాల్లో ఉన్న ప్రముఖుల నుండి ఇలాంటి ఔట్‌పెట్ ఎలా వచ్చింది అని ఆడియన్స్ సైతం నోరెళ్లబెట్టారు.ఫలితంగా చిత్రానికి దారుణమైన ఓపెనింగ్ వచ్చింది, ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకి వచ్చేంత ఓపెనింగ్ లో పావు శాతం కూడా రాబట్టలేకపోయింది.మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో చూస్తే.. ఫస్ట్ డే గ్రాస్ కేవలం 4 కోట్ల 70 లక్షలు మాత్రమేనట. షేర్ రూపంలో చూసుకుంటే 2 కోట్ల 22 లక్షల దాకా తేలుతుంది. ఇది మాములుగా చిన్న బడ్జెట్ సినిమాలకు డీసెంట్ ఫిగర్. కానీ ప్యాన్ ఇండియా రేంజ్ లో హంగామా చేసి వివిధ భాషల్లో ఒకేరోజు గ్రాండ్ రిలీజ్ జరుపుకున్న శాకుంతలం స్థాయికి ఏ మాత్రం సరితూగని నెంబర్లుగా చెబుతున్నారు.
తొలి రోజు వచ్చిన కలెక్షన్స్ లో దాదాపు రూ.1.25 కోట్ల వరకు ఓవర్సీస్ లో వసూలైనట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మరి ఈ వీకెండ్ వరకు ‘శాకుంతలం’ టికెట్స్ తెగొచ్చేమో గానీ లాంగ్ రన్ లో ఈ మూవీ పెట్టుబడి రావడం మాత్రం కష్టమనే టాక్ వినిపిస్తుంది. మహాభారతం ప్రారంభానికి ముందు శకుంతల మరియు దుష్యంత మహారాజు మధ్య చిగురించిన ప్రేమ ని అద్భుతంగా వర్ణిస్తూ కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంధాన్ని అధ్యయనం చేసి గుణశేఖర్ ఈ చిత్రాన్ని తనదైన స్టైల్ లో తెరకెక్కించాడు.అయితే ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో మేకర్స్ కి మింగుడు పడడం లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…