Roja : ఏపీ మంత్రి రోజా తరచు తిరుమలని సందర్శిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా తిరుమల స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం (సెప్టెంబర్ 6) కృష్ణాష్టమి సందర్భంగా ఆమె శ్రీవారి సేవలో పాల్గోన్నారు. దర్శనం అనంతరం మీడియాతో రోజా మాట్లాడారు. కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నానని చెప్పారు. భక్తులందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చడంపై రోజా స్పందించారు. ఇండియా పేరును భారత్‌గా మారిస్తే మంచిదేనని అన్నారు. ఇంగ్లీష్‌లో ఇండియా అని పిలవడం కంటే మన భాషలో భారత్ అని పిలవడం బాగుంటుందని చెప్పారు. భారత్, భారతదేశం అనే పదాలు చిన్నప్పటి నుంచి మనకు సుపరిచితం అని, ఇండియా పేరును భారత్‌గా మారిస్తే తాను స్వాగతిస్తానని పేర్కొన్నారు.
ఇక రోజా స్వామి వారి దర్శనం తర్వాత బయటకు వస్తుండగా, ఆమెతో ఫొటోలో దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.అయితే కొందరితో రోజా సరదాగా సెల్ఫీలు దిగిన కూడా మరి కొందరితో మాత్రం సెల్ఫీ దిగేందుకు చాలా ఇబ్బంది పడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీఐపీ విరామ సమయంలో రోజా స్వామివారిని దర్శించుకున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం కూడా స్వామి వారిని దర్శించుకుంది రోజా. ఆ సమయంలో రజనీకాంత్‌ని తాను విమర్శించలేదని క్లారిటీ ఇచ్చింది.
రజినీకాంత్ ని నేను ఎప్పుడూ విమర్శించలేదు..ఆయన ఎంత గొప్ప నటుడో అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్‌తో ఆయనకు ఉన్న అనుబంధం, గొప్పతనం గురించి చెప్పి ఉంటే అందరం మెచ్చుకునేవాళ్లం.. కానీ చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు. చంద్రబాబు పరిపాలన, విజనరీ చాలా గొప్పగా ఉందని.. ఆయనకు మరోసారి పట్టం కడితే ఏపీని ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలోకి తీసుకువ వస్తారని’ అని రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను నేను ఖండించాను. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎంతో గొప్ప స్థానం ఉంది. అలాంటి వ్యక్తి 14 ఏళ్ల సీఎం గా ఉండి ఏదీ సాధించని చంద్రబాబు గురించి మాట్లాడటం వల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అన్నాను రోజా చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…