Nara Lokesh : యువగళం పాదయాత్రలో నారా లోకేష్ దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఆయనకి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం బేతపూడిలో నారా లోకేష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. లోకేష్ శిబిరంలో జరిగిన దాడిలో భాగంగా.. భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు. యువగళంలో కార్యకర్తలు దాడి చేయడం, ఎక్కువగా వాహనాల ఏర్పాటు, ఫ్లెక్సీ వివాదంలో భాగంగా నోటీసులు ఇచ్చారు. మంగళవారం రాత్రి జరిగిన సభలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. గన్నవరంలో కూడా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆ నోటీసులు అందుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కవ్వింపులకు దిగారని.. తాడేరు దగ్గర తమపై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. యువగళం వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సరికాదన్నారు.
పోలీసుల ముందే నోటీసులు చదువుతూ.. వైసీపీ వాళ్లను కించపరిచేలా తామెప్పుడూ మాట్లాడట్లేదని, ఏ జిల్లాలో జరగని అరాచకాలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయని లోకేష్ ప్రశ్నించారు. తమ కార్యకర్తల చేతిలో ఎక్కడైనా ఒక్క రాయి అయినా చూశారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మాత్రమే వినియోగించుకుంటున్నామని, తాను పాదయాత్రను శాంతియుతంగానే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాము ఫిర్యాదులు చేసినా.. వాళ్లపై కేసులు నమోదు చేయట్లేదన్నారు. కొంతమంది పోలీసుల తీరు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందన్నారు. ‘నన్ను కించపరిచేలా వైసీపీ శ్రేణులు కార్టూన్లు వేస్తున్నారు.. మాకు కూడా అనుమతించండి.. మేం కూడా ఫ్లెక్సీలు వేస్తాం’ అని లోకేష్ అన్నారు.
టీడీపీ శ్రేణులపై దాడి చేసిన వారి ఫొటోలు ఉన్నాయని వారిని అరెస్ట్ చేశారా? అని లోకేష్ ప్రశ్నించారు. కవ్వింపు చర్యలకు పాల్పడే ఫ్లెక్సీల సంస్కృతి ఇప్పుడే చూస్తున్నామన్నారు. సీఎం జగన్ పర్యటన ఉంటే చాలు.. హౌస్ అరెస్టులు చేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పదాలు కించపరిచేలా ఉన్నాయో జగన్ చెప్పాలన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహియాత్ర సమయంలో ఇక్కడే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారన్నారు. అప్పుడే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. యువగళం వాలంటీర్లను అదుపులోకి తీసుకుని వైఎస్సార్‌సీపీ నేతల ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని.. చట్టాలు ఇరువైపులా సమానంగా అమలు చేయాలని లోకేష్ స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…