Samantha : ఒకప్పుడు ఎంతో సంతోషంగా, చలాకీగా ఉండే సమంత ఇప్పుడు ఎలాంటి పరిస్థితులలో ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. చైతూ నుండి విడిపోయిన బాధ ఒకవైపు మయోసైటిస్ వేధిస్తుండడం మరోవైపు. వీటి వలన సమంత చాలా కుంగిపోయింది. అయితే ఎన్ని బాధలలో ఉన్నా కూడా సమంత తన కర్తవ్యాన్ని వీడటం లేదు. తాను ఇచ్చిన మాటకు, పూర్తి చేయాల్సిన సినిమాల పనులను ఎంతో కష్టపడి పూర్తి చేసేస్తోంది. మయోసైటిస్‌తో సమంత బాధపడుతున్నా కూడా యశోద సినిమా కోసం బెడ్డు మీద నుంచే డబ్బింగ్ చెప్పింది ఆశ్చర్యపరచింది సమంత. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమా కోసం సైతం సమంత డబ్బింగ్ చెప్పేస్తోంది.
బెడ్డు మీద పడుకుని శాకుంతలం సినిమాకి సమంత డబ్బింగ్ చెప్పేస్తోంది. అసలు సమంత తన మొహాన్ని మాత్రం చూపించడం లేదు. మొహం మీదైనా ఏమైనా మార్పులు వచ్చాయా? లేదా? అన్నది తెలియడం లేదు. కానీ సమంత ఇప్పుడు శాకుంతలం సినిమా డబ్బింగ్ పనులతో బిజీగా ఉంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న సామ్ ఓ ఆసక్తికరమైన కొటేషన్‌ను కూడా రాసుకొచ్చింది. డబ్బింగ్ స్టూడియోలో తీసిన ఫొటోను పోస్ట్ చేసిన సమంత..’ఎన్ని బాధలు వచ్చినా, ఎంత నష్టపోయినా, ఈ ప్రపంచం మనల్ని వదిలేసినా మనకు తోడుగా ఉండేది కళ ఒక్కటి మాత్రమే . కళ మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం’ అనే కొటేషన్‌ను రాసుకొచ్చింది సమంత.
సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సమంత ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించినట్లున్న పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇటీవల విడుదలైన యశోద సినిమా మంచి హిట్ కాగా, గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుతలం సినిమాను ఫిబ్రవర్ 17వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సామ్ శంకుతలగా నటిస్తుండగా, దుష్కంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఈ చిత్రం కూడా సమంతకి మంచి విజయం అందిస్తుందని భావిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…