Ramya Raghupathi : గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో నరేష్- పవిత్ర- రమ్యరఘుపతి వ్యవహారం తెగ హాట్ టాపిక్ అవుతుంది. మూడో భార్య అయిన రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చిన నరేష్.. పవిత్రతో సహజీవనం చేస్తుండడమే కాదు ఆమెని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డిసెంబర్ 31వ తేదీన నరేష్ , పవిత్ర లిప్ కిస్ చేసుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 2023 కి కొత్తగా స్వాగతం పలుకుతున్నామంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే ఇప్పటివరకు వివాహం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఈ జంట ఏకంగా వివాహం చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించడంతో అనేక చర్చలు జరిగాయి.
నరేష్ తన మూడవ భార్య రమ్యకు కోట్లలో భరణం ఇచ్చి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అన్ని విషయాలు క్లియర్ అయిపోవడంతో నరేష్ పవిత్ర వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సాగగా, తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మొట్టమొదటిసారిగా తెలుగు మీడియా ముందుకు వచ్చారు. నరేష్ పవిత్ర లిప్ లాక్ వీడియో మీద మీరు చాలా కంగారు పడుతున్నారని తెలిసిందని యాంకర్ పేర్కొనగా ఇది మీకు కొత్త ఏమో కానీ నాకు కొత్త కాదని రమ్య రఘుపతి చెప్పింది. తాను నరేష్ మీద ఆరోపణలు చేశానని దానికి తగిన సాక్ష్యాలు కూడా తాను కన్నడ మీడియా ముందు పెట్టానని ఆమె పేర్కొన్నారు.
దేవుడి లాంటి కృష్ణగారితో తనకు అక్రమ సంబంధం ఉందని నరేశ్ ఆరోపించినట్లు రమ్య తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. కానీ కృష్ణగారి ఇంటి ప్రతిష్ట, మర్యాదలను దృష్టిలో పెట్టుకుని ఇన్నాళ్లూ ఈ నిజాన్ని చెప్పలేదన్నారు. కానీ రోజురోజుకు నరేశ్ దారుణాలు పెరిగిపోతున్నాయని.. అందుకే ఈ నిజం చెప్పాల్సి వచ్చిందని రమ్య అన్నారు. నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు నరేశ్ చేయని పనులు లేవు. చివరికి కృష్ణగారి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. నాకు ఇంజంక్షన్ సూట్ పంపారు. అందులో నా నుంచి కృష్ణగారికి ప్రాణహాని ఉందని రాశారు. ఈ విషయాన్ని కృష్ణగారి దృష్టికి తీసుకువెళ్లమని మా కుటుంబ సభ్యులు చాలా మంది చెప్పారు. కానీ నరేశ్ చేసే పనుల వల్ల ఆయన గౌరవం దెబ్బతినకూడదని నేను.. కృష్ణగారితో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇలాంటి దారుణాలు చేసి.. నా నుంచి విడాకులు తీసుకోవాలని నరేశ్ ఎంతో ట్రై చేస్తున్నాడు. కానీ నేను విడాకులు ఇవ్వను. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. అన్నీ కోర్టులోనే తేల్చుకుంటాను అని రమ్య చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…