Samantha : గ్లామరస్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన ఈ భామ మయోసైటిస్ వలన సినిమలకి బ్రేక్ ప్రకటించింది. సమంత ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మాయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ దాన్ని నుంచి కోలుకోవడానికి ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తెలుగులో చివరిగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సామ్. ఆ తర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది. అక్కడ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది.
తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. హిందీలో ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేసింది. దాంతో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవల సమంత ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ ఇస్తూ వార్తలలో నిలుస్తుంది. తన ఫిట్‌నెస్ ట్రైనర్ అల్కేష్ షరోత్రితో కలిసి ‘టేక్ 20’ పేరుతో ఇన్‌స్టా వేదికగా ఆరోగ్య సూత్రాలను వల్లెవేస్తున్నది ఈ అందాలభామ. ఇందులో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నది. ఇదిలావుంటే.. సమంత టిప్స్‌పై ఓ నెటిజన్ క్వశ్చన్ చేశాడు. ‘ఇప్పుడీ సూక్తులు చెబుతున్నారు బాగానే వుంది. గతంలో మీరు అనారోగ్యమైన బ్రాండ్లను ప్రమోట్ చేశారు. దానికేం సమాధానం చెబుతారు?’ అని అడిగాడు.
దాంతో కంగు తినడం సామ్ వంతైంది. వెంటనే తను రియాక్టవుతూ ‘గతంలో తప్పులు చేసిన మాట నిజమే. అవి తెలియక చేసిన తప్పులు. తెలుసుకున్న తర్వాత అలాంటి వాటిని ప్రమోట్ చేయడం పూర్తిగా ఆపేశాను. ప్రస్తుతం ఏవైతే ఆచరిస్తున్నానో.. వాటిని మాత్రమే చెబుతున్నాను’ అని తెలిపారు. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థలో ‘మా బంగారం’ అనే సినిమాను రూపొందిస్తున్నది సమంత. ఈ భామ అనేక రకాల బ్రాండ్స్‌కు ప్రచారం చేసింది. వాటిలో కొన్ని హానికర ఉత్పత్తులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే నెటిజన్ అడిగిన ప్రశ్నకు కవర్ చేయకుండా సూటిగా, నిజాయితీగా సమంత నిజం చెప్పింది. కాగా ఈ వ్యాఖ్యలతో సమంత మరోసారి టాలీవుడ్‌లో అందరిదృష్టిని ఆకర్షించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…