Tripti Dimri : రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ మూవీ యానిమల్. ఈ మూవీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఒక హీరోయిన్ తృప్తీ దిమ్రీ. సినిమాలో ఉన్నది 15 నిమిషాలే కావచ్చు. కానీ, పాన్ ఇండియా లెవల్లో ఈ బ్యూటీకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇప్పుడు ఆమె నుంచి వచ్చే ఏ మూవీ అయినా బ్రేక్ ఇవ్వడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ ఒక క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అది కూడా అలాంటి ఇలాంటి కాన్సెప్ట్ కాదు. ఒక బిడ్డకు ఇద్దరు తండ్రులు.. వైద్యశాస్త్రంలోనే అరుదైన ఘట్టం ఇది. యానిమల్ తరువాత త్రిప్తి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఆమె చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి.
కాగా సెలబ్రిటీలు తరచుగా తమ చర్మ సంరక్షణ, మేకప్ హ్యాక్‌లను అభిమానులతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. అలాగే గతేడాది ఒక ఇంటర్వ్యూలో త్రిప్తి డిమ్రీ తన బ్యూటీ సీక్రెట్ ను పంచుకుంది. ఆ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. త్రిప్తి మెరుస్తున్న చర్మం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించగా, తన చర్మం చాలా సున్నితంగా ఉంటుందని పేర్కొంది, అందుకే ఆమె తక్కువ కెమికల్ కంటెంట్ ఉన్న సున్నితమైన ఉత్పత్తులను ఉపయోగిస్తుందట. త్రిప్తి మాట్లాడుతూ “నేను చాలా సాధారణ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను. నేను సున్నితమైన క్లెన్సర్‌తో నా ముఖాన్ని కడుక్కుంటాను. నా చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే అధిక రసాయనాలు ఉన్న ఉత్పత్తులకు వెంటనే రియాక్ట్ అయ్యి, ఏదో ఒక ఎలర్జీ లాంటి సమస్య వస్తుంది.
ఇక మాయిశ్చరైజర్ విషయానికొస్తే.. నేను క్లినిక్ మాయిశ్చర్ సర్జ్ ని ఉపయోగిస్తాను. ఇది చాలా తేలికగా ఉంటుంది. నా చర్మానికి కరెక్ట్ గా సరిపోతుంది” అని చెప్పుకొచ్చింది. ఇక డే బై డే త్రిప్తి తన స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా విటమిన్ సి సీరమ్‌ను ఉపయోగిస్తుందట. మాయిశ్చరైజర్ అప్లై చేసేముందు ఆమె సీరమ్‌ను అప్లై చేస్తుందట. సూర్యకాంతి లేని టైమ్ లో కూడా తాను సన్‌స్క్రీన్‌ను ఉపయోగిస్తానని త్రిప్తి తెలిపింది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాగే చేయాలని ఆమె తన అభిమానులకు కూడా సలహా ఇచ్చింది. దీని గురించి త్రిప్తి మాట్లాడుతూ “నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా SPFని ఉపయోగిస్తాను. ఈ అలవాటు నా చర్మాన్ని మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ రొటీన్ లో భాగంగా దీనిని ఉపయోగించాలని నేను భావిస్తున్నాను” అని చెప్పింది. అయితే తాజాగా ఈ భామ క్రేజీ లుక్స్ తో మంత్ర ముగ్ధులని చేసింది. హాట్ లుక్స్ తో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ భామ స్టన్నింగ్ లుక్స్ ప్రతి ఒక్కరి మతులు పోగొడుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…