Nandamuri Mokshagna : నందమూరి మోక్షజ్ఞ రాక కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడో అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞకి 29 ఏళ్లు కూడా వచ్చేశాయి.. దీంతో వీలైనంత త్వరగా లాంఛ్ చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే తన కుమారుడిని ఈ ఏడాది టాలీవుడ్‌లోకి హీరోగా వదులుతున్నట్లు బాలయ్య గతంలోనే చెప్పారు. దీంతో ఏ డైరెక్టర్‌తో మోక్షజ్ఞని లాంఛ్ చేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయడం పక్కా అని బాలయ్య చెబుతున్నా కూడా, ఎప్పుడు ఎవరితో లాంచ్ చేయనున్నాడనేది సస్పెన్స్‌గా మారింది.
డైరెక్టర్ దాదాపు కన్‌ఫాం అయినట్టు తెలుస్తుండగా, నిర్మాత విషయంలోనే నందమూరి కుటుంబం గందరగోళంలో ఉందట . మోక్షజ్ఞ నటించే సినిమాకు నిర్మాతగా ఎవరు ఉండాలన్నదే తేల్చుకోలేకపోతోందట.. మోక్షజ్ఞతో సినిమా చేసే విషయంలో బాలయ్య ఇద్దరు కుమార్తెలు పోటీ పడుతున్నారని టాక్. తమ ముద్దుల తమ్ముడి మొదటి సినిమా నిర్మాత బాధ్యతలు తనకి కావాలంటే తనకు కావాలని బాలయ్య ఇద్దరు బిడ్డలు బ్రాహ్మణి, తేజశ్వని పోటీపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య పిల్లల్లో చిన్నకుమార్తె తేజశ్వనికి మాత్రమే ప్రస్తుతం సినీ రంగంతో అనుబంధం ఉంది. బాలయ్య సినిమా వ్యవహారాలను తేజశ్వని పర్యవేక్షిస్తుంటారు. దీంతో తమ్ముడు మోక్షజ్ఞ సినిమాను తాను నిర్మిస్తానని ముందుకొచ్చారట తేజశ్వని.
అయితే ఆ అవకాశం తనకే ఇవ్వాలని బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి పట్టుబడుతున్నారని తెలుస్తోంది. తన గారాల తమ్ముడి తొలి సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట బ్రాహ్మణి. ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న బ్రాహ్మణి సినీ నిర్మాతగా మారతానంటుండటం, ఇంకో కుమార్తె కూడా నిర్మాణానికి ఆసక్తి చూపుతుండటంతో ఏమీ తేల్చుకోలేకపోతున్నారట బాలయ్య. ఇద్దరి కూతుళ్ల మధ్య బాలయ్య తెగ నలిగిపోతున్నట్టు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి చివరికి ఏం చేస్తారో.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…