Actress : 2002 సంవత్సరం నుంచి సినిమా రంగంలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న అందాల ముద్దుగుమ్మలలో భావన ఒకరు..కేరళకు చెందిన భావన అసలు పేరు కార్తికా మీనన్.70కు పైగా సినిమాలలో నటించిన భావన తన నటనతో అనేక అవార్డ్‌లు సైతం అందుకుంది. సినిమా పరిశ్రమ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న భావన తండ్రి సినిమాటోగ్రాఫర్ గా పని చేయడం గమనార్హం. స్వప్న సుందరిలాంటి ‘భావనా మీనన్’అందాలు చూశాక ఫిదా అవ్వని వారు ఎవరైనా ఉంటారా.తెలుగులో మహాత్మ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది భావన.
కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే భావన కిడ్నాప్ కు గురైంది. ఓ స్టార్ హీరో ఆమెను దుండగులతో బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారని ప్రచారం సాగింది. అయితే ఈ కేసులో మలయాళీ నటుడు దిలీప్ ను నిందితుడిగా పరిగణిస్తూ అరెస్ట్ చేయగా.. కొన్నాళ్లకు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన.. 2018లో నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది భావన. గతంలో తనపై ఎన్నో రూమర్స్ వచ్చాయంటూ కూడా భావన తెలియజేసింది. అనూప్ మీనన్ ను పెళ్లి చేసుకున్నట్లు తప్పుడు వార్తలను సృష్టించారని.. అలాగే అనేకసార్లు అబార్షన్స్ అయ్యాయని రూమర్స్ క్రియేట్ చేశారని తెలిపింది. ఒకసారి ఏకంగా తాను చనిపోయానంటూ ప్రచారం చేశారని.. ఇలా ఎన్నో విధాలుగా తన గురించి.. తన జీవితం గురించి అసత్యాలను సృష్టించారని చెప్పుకొచ్చింది.
అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని అన్నారు. అలాగే అలువాలో నాకు గర్భస్రావం అయ్యిందని.. కొచ్చిలో.. చెన్నైలో అబార్షన్స్ చేయించుకున్నానని ప్రచారం చేశారు. అబార్షన్ వల్లే నేను చనిపోయానని కొందరు అన్నారు. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే తట్టుకోలేను. ఆ సమయంలో నా గురించి వచ్చిన రూమర్స్ విని మానసికంగా చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు బలంగా ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే భావన ఇప్పుడు సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపుతుంది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారుతుంది. అది చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…