Fahadh Faasil : అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం పుష్ప. ఈ సినిమా విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూశాం. ఇందులో విలన్‌గా నటించారు ఫహాద్ ఫాజిల్. ఆయన స్వతహాగా మలయాళ నటుడు. నిర్మాతగానూ పలు సినిమాలు తీసి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే విడుదలైన ‘ఆవేశం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మలయాళంలో నిర్మాతగా ఫహాద్ పలు సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే ఇటీవల పింకేలీ సినిమా షూటింగ్‌ను ఓ ప్రభుత్వాసుపత్రిలోని ఎమర్జన్సీ వార్డులో చేశారు. గురువారం రాత్రంతా ఎమర్జన్సీ వార్డులో షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బంది పడ్డారు.
అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా అనుమతి ఇచ్చారని చెప్పి ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి కూడా చిత్ర యూనిట్‌పై సీరియస్ అయ్యారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, సినీ నిర్మాతల సంఘం మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. రాత్రి షూటింగ్ కోసం రూ.10 వేలు చెల్లించామంటూ చెప్పింది.కాకపోతే ఆ రోజు రోగులకు చికిత్స జరుగుతుండగా.. మరోవైపు షూటింగ్ జరిగిందని.. దీంతో రోగులు.. వారితోపాటు ఉన్న కుటుంబసభ్యులు చాలా ఇబ్బందులు పడ్డారని వార్తలు వచ్చాయి. అత్యవసర చికిత్స అవసరం ఉన్నప్పటికీ పలువురు రోగులను ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా చిత్రయూనిట్ అడ్డుకున్నారని.. ఆసుపత్రిలో రాత్రంతా నానా హంగామా చేశారని అక్కడున్న రోగులు చెప్పుకొచ్చారు.
అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం మాత్రం నిర్మాత ఫహాద్ ఫాజిల్‌పై కేసు పెట్టింది. ఫహాద్ ఫాజిల్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పుష్ప చిత్రంతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మరి ఈ వివాదంపై ఫహద ఫాజిల్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాల్సి ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…