Rajinikanth : తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చే చిత్రాలకు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంది. రీసెంట్‌గా రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం విడుదల కాగా, ఈ మూవీ ఇండియా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా గ్రాండ్‌గా విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. శుక్రవారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 40 కోట్లు రాబట్టింది. ఇలా 2 రోజుల్లో దాదాపు రూ. 134 కోట్లు షేర్‌తో పాటు రూ. 260 కోట్లు గ్రాస్‌ను ఇది వసూలు చేసింది. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ మూవీని విడుదల చేశారు.
ప్రభాస్ కు ఎలాగూ తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. అయితే మిగతా భాషల్లో కూడా అదేస్థాయిలో కలెక్షన్లు సాధించాలనే లక్ష్యంతో ప్రభాస్ ఉన్నారు. మరోవైపు ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. “కల్కి సినిమా అద్భుతంగా ఉంది. ఇండియన్ సినిమాను నాగ్ అశ్విన్ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో నటించిన వారికి ఈ సినిమాకు పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ రజినీకాంత్ ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు దర్శకుడు నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ “మాటలు రావడం లేదు సర్..టీమ్ అందరి తరపున కృతజ్ఞతలు” అని చెప్పారు.
ఇక అక్కినేని నాగార్జున సైతం మూవీపై ప్రశంసల జల్లు కురిపించారు. కల్కి టీమ్ అందరికీ అభినందనలు. నాగీ మీరు మమ్మల్ని మరోక స్థాయికి తీసుకెళ్లారు. పురాణాలు, చరిత్రను కలుపుతూ అల్లుకున్న అద్భుతమైన కల్పన కల్కి. అసలైన మాస్ హీరో అమితాబ్. మీరు నిప్పులు కురిపిస్తున్నారు. సీక్వెల్లో కమల్ సర్ ను చూడటానికి వేచి చూస్తున్నాను. ప్రభాస్ నువ్వు మరోసారి సత్తా చాటావు. దీపికా మీరు అద్భుతంగా నటించారు. మీరంతా కలిసి ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి నిరూపించారు” అంటూ ప్రశంసించారు కింగ్ నాగార్జున. మొదటి పార్ట్ మంచి హిట్ కావడంతో రెండో పార్ట్ చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…