Samantha : అందాల ముద్దుగుమ్మ సమంతకి 2021 నుండి అనేక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. నాగ చైతన్య నుండి విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధిన బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగింది. ఆ వ్యాధితో తీవ్రంగా పోరాడిన సమంత ఎట్టకేలకు కోలుకొని ప్రస్తుతం తను కమిటైన సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది.ప్రస్తుతం రాజ్ అండ్ డీకే సిటాడెల్ వెబ్ సిరీస్, శివ నిర్వాణ ఖుషి సినిమాను పూర్తి చేయాలని అనుకుంటోంది. ఈ ప్రాజెక్టుల కోసమే హెవీ వర్కౌట్లు చేస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రిహార్సల్స్ కూడా చేస్తోంది.
అయితే ఈ క్రమంలో సమంత చేతికి గాయాలయ్యాయి. చేయి, వేళ్లు అంతా కూడా కమిలిపోయి రక్తం కారుతూ ఉంది. యాక్షన్ షూట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో సమంత తన ప్రాక్టిస్ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటునే ఉంది. ఈ క్రమంలో తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూస్తే సమంత ప్రస్తుతం ఎంతగా కష్టపడుతోందో.. అర్ధమవుతుంది. ఇంతలా రిహార్సల్స్ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తోందంటే.. తెరపై ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ట్రైనర్ జునైద్ ఆధ్వర్యంలో ఈ రిహార్సల్స్ చేస్తున్నట్టుగా ఉంది. సమంత తన చేతి పరిస్థితిని చెబుతూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టేసింది.
మయోసైటిస్ కారణంగా ‘యశోద’ చిత్రం తర్వాత కొంత విరామం తీసుకున్న సమంత.. తిరిగి తన ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో పడింది. ‘శాకుంతలం’ ప్రమోషన్స్ చేస్తూనే రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. త్వరలోనే ‘ఖుషి’ చిత్రీకరణలోనూ సామ్ జాయిన్ కాబోతోంది. ఇక సమంత నటించిన డెబ్యూ చిత్రం ఏమాయ చేశావే విడుదలై 13 ఏళ్లు పూర్తైన క్రమంలో రీసెంట్‌గా సమంత తన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…