Rohit Sharma : రోహిత్‌ – కోహ్లీ మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయా.. విరాట్ మాట‌ల వెనుక ఉన్న అర్థం ఏంటి..?

Rohit Sharma : ప్ర‌స్తుతం టీమిండియాలో ఉన్న సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్స్ లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఉండ‌గా వారిద్దరి మ‌ధ్య లోలోన విభేదాలు న‌డుస్తున్నాయ‌నే ప్ర‌చారం కొన్నాళ్లుగా న‌డుస్తూనే ఉంది. కెప్టెన్సీ నుండి త‌ప్పుకున్న త‌ర్వాత విరాట్ చాలా మ‌ద‌న‌ప‌డ్డాడ‌ట‌. తాజాగా ఆర్‌సీబీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ప్లేయర్‌గా జట్టులో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆటగాడిగా జట్టులో సర్దుకోవడానికి మొద‌ట్లో చాలా ఇబ్బంది ప‌డ్డాడ‌ట‌.. కెప్టెన్‌ను కాదనే విషయాన్ని వొంటబట్టించుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. జట్టులో ఓ సాధారణ ప్లేయర్‌గా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది అని విరాట్ అన్నాడు.

కెప్టెన్సీ అలవాటులో భాగంగా మైదానంలో కొన్నిసార్లు ఏదో నిర్ణయం తీసుకోవడానికి, సలహాలు చెప్పడానికి ముందుకు వచ్చేవాడిని . అయితే ఆ వెంటనే ‘నువ్వు కెప్టెన్ కాదురా అయ్యా’అనే విషయాన్ని నాకు నేను చెప్పుకునేవాడిని. చాలాసార్లు ఏదో చెప్పాలని అనుకునేవాడిని. అలా చాలా సార్లు.. అనేక సందర్భాల్లో ముందుకు వచ్చి వెనకడుగు వేసేవాడిని. మన అభిప్రాయానికి విలువ లేదని తెలిసినా చెప్పడం అవివేకమే అవుతుంది. ఆర్సీబీ విషయంలో నాకు ఈ ఇబ్బంది లేదు. డుప్లెసిస్‌కు నేను ఏది చెప్పిన వింటాడు. నా మాటకు గౌరవం ఇస్తాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా త‌ప్పుకోవ‌డంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని కోహ్లీ అన్నాడు. అయితే కోహ్లీ చేసిన కామెంట్స్ లోతుల్లో చాలా అర్థాలే దాగున్నాయి. మాజీ కెప్టెన్ కోహ్లీ మాట‌లు చూస్తే ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని స్పష్టం అవుతుంది.

Rohit Sharma and Virat Kohli got differences what they said
Rohit Sharma

అయితే కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కు కోహ్లీ ఫామ్ లేమితో చాలా ఇబ్బంది ప‌డ్డాడు. జ‌ట్టు నుండి అత‌నిని త‌ప్పించాలనే వాద‌న కూడా మొద‌లైంది. ఆ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ ఆయ‌నకు స‌పోర్ట్‌గా నిలాచాడు. కోహ్లీ లాంటి ఆటగాడి అవసరం టీమిండియాకు ఉంద‌ని అన్నారు. ఇక టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాకిస్థాన్‌పై కోహ్లీ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను గెలిపించిన తర్వాత.. గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన రోహిత్‌.. కోహ్లీని అమాంతం ఎత్తుకున్నాడు. ఇలా పలు సందర్భాలతో కోహ్లీ-రోహిత్ ప్ర‌వ‌ర్త‌న వారి మ‌ధ్య విబేధాలు ఉన్న‌ట్టు అనిపించేలా చేయ‌లేదు. అయితే కోహ్లీని చాలా స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చిన రోహిత్ గురించి ఏ నాడు కోహ్లీ పాజిటివ్‌గా మాట్లాడ‌లేదు. ఇప్పుడు కూడా డుప్లెసిస్‌ని పొగిడి రోహిత్ త‌ప్పు చేశాడ‌నే విధంగా వ్యాఖ్య‌లు చేశాడు. దీనిపై క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago