Puli Meka Web Series : టాలీవుడ్ హీరో, హీరోయిన్లు ఆది సాయికుమార్, లావణ్యత్రిపాఠి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన తొలి వెబ్‌సిరీస్ పులిమేక. కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌కు కోన వెంకట్ కథను అందిస్తూ స్వయంగా నిర్మించగా, ఇది పూర్తిగా. సైకో కిల్లర్ కథాంశంతో రూపొందింది. ఈ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీలో విడుదల కాగా, ఆదిసాయికుమార్, లావణ్య త్రిపాఠి తొలి ఓటీటీ ప్రయత్నం ప్రేక్షకుల్నిమెప్పించిందా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే.. హైదరాబాద్ లోని పలువురు పోలీస్ ఆఫీసర్లని ఒక సీరియల్ కిల్లర్ ఒకరి తరువాత మరొకరిని హత్యచేస్తూ ఉంటాడు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి పెద్ద సమస్యగా మారుతుంది.
వృత్తి పరంగా మంచి ట్రాక్ రికార్డు కలిగిన ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి) ని ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకునేందుకు స్పెషల్ ఆఫీసర్ గా నియమించడం జరుగుతుంది.. అయితే తన టీమ్ తో కలిసి ఆమె ఇన్వెస్టిగేషన్ ప్రారంబించిన సమయంలో ఆమెకు ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ లో హెడ్ గా వర్క్ చేసే ప్రభాకర్ శర్మ (ఆది సాయి కుమార్) సహాయం చేస్తుంటాడు. మరి ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు, అసలు అతడు పోలీస్ డిపార్ట్ మెంట్ ని ఎందుకు టార్గెట్ చేసాడు, ఫైనల్ గా అతడిని కిరణ్ ప్రభ పట్టుకున్నారా లేదా అనేది చిత్రం మిగతా కథ. రొటీన్ కథను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంపైనే జయాపజయాలు ఆధారపడిఉంటాయి.
ఈ విషయంలో పులి మేక వెబ్‌సిరీస్ దర్శకరచయితలు కొంత వరకు సక్సెస్ అయ్యారు. ప్రతి ఎపిసోడ్‌లో ప్రేక్షకుల ఊహలకు అందని ట్విస్ట్ ఇస్తూ చివరి వరకు ఉత్కంఠభరితంగా సిరీస్‌ను నడిపించారనే చెప్పాలి.తొలి నాలుగు ఎపిసోడ్స్ థ్రిల్లింగ్‌గా నడిపించిన దర్శకుడు చివరి నాలుగు ఎపిసోడ్స్‌లో ఎమోషన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ ఈ సిరీస్ లో కీలక రోల్ చేసారు. ఈ సిరీస్ లో పల్లవి పాత్రలో ఆమె కనబరిచిన నటన, ఎమోషన్స్ నిజంగా ఎంతో బాగున్నాయి. కొన్ని అనవసరమైన ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు, అలానే స్టోరీ లైన్ కి అవి పెద్దగా అవసరం లేదనిపిస్తుంది. అలానే కొన్ని అన్ పార్లమెంటరీ పదాలు ఆడియన్స్ కి ఇబ్బందికరంగా అనిపించాయి.థ్రిల్లర్ జోనర్ ట్రెండ్‌ను ఇష్టపడేవారిని పులి మేక వెబ్‌సిరీస్ మెప్పిస్తుంది. ఎనిమిది ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులని కొంత వరకు అయితే ఎంగేజ్ చేయగలుగుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…