Sudheer Babu : మహేష్ బావ, ప్రముఖ టాలీవుడ్ హీరో సుధీర్ బాబు పేరు చెబితే అతని సిక్స్ ప్యాక్ అందరి కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. కెరీర్‌లో హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్న సుధీర్ బాబు ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు . ప్రతీ సినిమాకు తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న సుధీర్‌కి, టైమ్ బాలేకో, అదృష్టం లేకో ఆయన సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పడుతున్నాయి. ఈ ఏడాది రిలీజైన హంట్ సుధీర్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇదిలా ఉంటే తాజాగా సుధీర్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ అనే చిత్రం చేస్తున్నాడు. హర్ష వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ స్కేల్ లో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో సుధీర్ బాబు లుక్‌కి సంబంధించిన వీడియో ఒకటి లీక్ కాగా, ఇందులో ఆయన లుక్ అందరు నోరెళ్లపెట్టేలా చేస్తుంది. డీవోపీ టెస్ట్ కోసం స్టూడియోకు వచ్చిన వీడియో క్లిప్ లో సుధీర్ బాబు చాలా లావుగా.. గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఫిట్‌నెస్ విషయంలో ఎంతో పర్‌ఫెక్ట్‌గా ఉండే సుధీర్ బాబు ఇలా లావుగా కనిపించడం చూసి అందరు అవాక్కవుతున్నారు.
కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న మామా మశ్చీంద్ర సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో భాగంగానే సుధీర్ లావు అవతారమెత్తినట్లు తెలుస్తుంది. ఏదైమైనా ఎప్పుడు సిక్స్‌ప్యాక్‌తో బెస్ట్ బాడీతో కనిపించే సుధీర్ ఒక్కసారిగా లావుగా కనిపించే సరికి అందరూ షాక్ అవుతున్నారు. ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదుగానీ కరెంట్ తీగలా ఉండే సుధీర్‌బాబు లడ్డూబాబులా కనిపించడంతో ఫ్యాన్స్ ఇంకా ఆ షాక్ నుండి బయటకు రాలేకపోతున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…