Samantha : ఇటీవల సమంత తాను కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స పొందుతున్న ఫొటోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఎప్పటికప్పుడు సమంత ఆరోగ్య పరిస్దితి ఏమిటి.. ఆమె ఏ ట్రీట్మెంట్ తీసుకుంటోందనే విషయమై అభిమానులు ఆసక్తిగా చర్చలు జరుపుతున్నారు. ఈ వ్యాధి బారిన పడ్డానని సమంత ప్రకటించినప్పటి నుంచి.. సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు ఆవేదనను వ్యక్తం చేశారు. సమంతకు ధైర్యం చెప్పారు.
ప్రస్తుతం సమంత షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుందని ఇటీవల కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తాజాగా సమంత మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం కోసం కేరళ వెళ్లిందని సమాచారం. సమంతకి మాయోసైటిస్ వచ్చాక అమెరికాలో ఒకసారి చికిత్స తీసుకుంది. అయితే మయోసైటిస్‌కు అమెరికాలో చికిత్స చేయించుకున్న సామ్ ఇండియాలో కూడా అదే ట్రీట్ మెంట్ కంటిన్యూ చేస్తుంది. అయితే ఇప్పుడు సమంత కేరళలో ఆయుర్వేద వైద్యంతో తగ్గుతుందని తెలిసి కేరళ వెళ్లినట్టు తెలుస్తుంది.
అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. మరోవైపు సమంతకు ఇంగ్లీష్ మెడిసన్స్‌తో వ్యాధి నయం కాకపోవడం వల్లే.. ఆయుర్వేద వైద్యం తీసుకుంటుందని పలువురు జోరుగా చర్చించుకుంటున్నారు. సామ్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది అని, సమంతపై వస్తున్న వార్తలు నమ్మొద్దని తను కోలుకుంటుందని చెప్పుకొచ్చారు సామ్ మేనేజర్. సమంత రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమా చేస్తుంది. గుణ శేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం అనే సినిమాలో కూడా నటిస్తుంది సామ్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…