Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల పలు వివాదాలు, సినిమాలు, ఆరోగ్య సమస్యలతో తెగ వార్తలలో నిలుస్తుంది. కొన్నాళ్లుగా మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత 2022 అక్టోబర్ నెలలోతన హెల్త్ ప్రాబ్లమ్ బయటపెట్టారు. ఈ విషయం తెలిసి అందరు షాక్ అయ్యరు. అయితే అనారోగ్యం వలన యశోద చిత్రానికి ఇంట్లోనే ఉండి డబ్బింగ్ చెప్పారు. ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. కేవలం ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు నాలుగు నెలలు సమంత బయట కనిపించని సమంత ఇప్పుడిప్పడే మళ్లీ బయట కనిపిస్తుంది.
రీసెంట్‌గా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా కనిపించింది.ఇక సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నారు. అయితే శాకుంతలం చిత్ర ప్రమోషన్‌లో తాను అలసట, నీరసంతో బాధపడుతున్నట్లు చెప్పారు. కళ్ళు కాంతిని చూడలేకపోతున్నాయని అందుకే గ్లాసెస్ పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అభిమానులు కాస్త ఆందోళన చెందుతుండగా, సమంత సడన్ గా ఆక్సిజన్ మాస్క్ తో కనిపించడం షాక్ ఇచ్చింది. ఆమెకు ఏమైందనే సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె నెక్స్ట్ ఫోటో చూశాక అందరికి ఓ క్లారిటీ వచ్చింది.
సమంత ఆ మాస్క్ పెట్టుకుంది హైపర్బేరిక్ థెరపీ కోసమని, దాని వలన కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుందని చెప్పుకొచ్చింది. పాడైన కండరాలను బాగుచేస్తుందని సమంత వెల్లడించారు. మయోసైటిస్ సోకిన నేపథ్యంలో సమంత హైపర్బేరిక్ థెరఫీ తీసుకుంటున్నారని అభిమానులు భావించి ఊపిరి పీల్చుకున్నారు. ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న సమంతకి ఇటీవల ఇన్ని సమస్యలు వస్తుండడంతో ఆమెకి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇక సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం సిటాడెల్, ఖుషి చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉంది. ఖుషీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…