Allari Naresh : ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రెండవ కుమారుడుగా సినీ ఇండస్ట్రీలోకి అల్లరి సినిమాతో అడుగుపెట్టిన అల్లరి నరేష్ ఆ సినిమాతో తన కెరీర్ ని గాడిలో పెట్టుకున్నాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ ఆ తర్వాత అన్ని కామెడీ జానర్ లోనే సినిమాలు ఎంచుకొని ప్రేక్షకులకి మంచి వినోదం పంచారు. అయితే అల్లరి నరేష్ ఎక్కువగా తన తండ్రి దర్శకత్వంలోనే సినిమాలను తెరకెక్కించి మంచి కామెడీ టైమింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లరి నరేష్ తను నటించే ప్రతి సినిమా కూడా కామెడీ పండించడంలో ఆయనకు ఆయనే సాటి అనేంతగా పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు.
ఇటీవల కామెడీకి కాస్త దూరంగా ఉంటూ సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. సీరియస్ రోల్స్‌లో ది బెస్ట్ అయిన ‘గాలి శీను’ అల్లరి నరేశ్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక అల్లరి నరేష్ అలాంటి సీరియస్ పాత్ర చేసిన సినిమా ‘ఉగ్రం’. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆరోగ్యం పాడయ్యిందట. దగ్గుతో చాలా బాధపడ్డారట. అందుకు కారణం విపరీతంగా సిగరెట్స్ కాల్చటమే అంటున్నారు. సాధారణంగానే సిగరెట్స్ తాగితే ఆరోగ్యం పాడవుతుంది. అలాంటిది నాలుగు రోజుల్లో 500 సిగరెట్స్ తాగితే ఏమవుతుంది. ఆరోగ్యం పాడుకావడంతో చాలా ఇబ్బందులు పడ్డాడట అల్లరి నరేష్.
‘ఉగ్రం’ సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసం నాలుగు రోజులకి 500 సిగరెట్స్ తాగారట నరేశ్. నైట్ టైమ్‌లో షూట్ చేసిన ఆ ఫైట్‌లో నరేష్ సిగరెట్ కాలుస్తూ కనిపించాలట. అయితే ఈ ఫైట్‌ను నాలుగు రోజులు చిత్రీకరించారట. దీంతో ఆ నాలుగు రోజులూ ఆయన సిగరెట్స్ కాలుస్తూ నటించారట. అలా ఫైట్ పూర్తయ్యేలోపు దాదాపు 500 సిగరెట్స్ తాగేశారట నరేష్. అంటే రోజుకి వందకి పైగా సిగరెట్స్ అన్నమాట. ఉగ్రం చిత్రంలో అల్లరి నరేష్‌కు జోడీగా మిర్నా నటించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఏప్రిల్ 28న మూవీ రిలీజ్ అవుతుంది. నరేష్, విజయ్ కనక మేడల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావటంతో ఉగ్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…