Sai Dharam Tej : సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండును దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘విరూపాక్ష’. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించగా, సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 21న.. శుక్రవారం సినిమా విడుదల కాగా, ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా విజయం తర్వాత చిత్ర యూనిట్‌కి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అయితే చిత్రంలో కథానాయికగా నటించిన సంయుక్త మీనన్ కి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. సంయుక్తా మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కాగా, ఆ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో మరో హిట్ అందుకుంది. అలాగే ధనుష్ నటించిన సార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. ఇక లేటెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి హిట్ కావడంతో అది కూడా సంయుక్త ఖాతాలో మరో హిట్ పడింది.
సంయుక్త మీనన్‌ని అందరు ఇప్పుడు గొల్డెన్ లెగ్ అంటుంటే దానికి విరూపాక్ష దర్శకుడు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సంయుక్త మీనన్‌ని సాయిధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్‌కి ముందే ఎంపిక చేశాం కాబట్టి ఆమెను ఐరెన్ లెగ్ అనలేం కదా. ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ వంటివి ఏమి ఉండవని చిత్ర విజయం స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. సంయుక్త వచ్చాకే తేజూకి ప్రమాదం జరిగిందని కార్తీక్ అనడంతో ఆమె వెరైటీ ఎక్స్‌ప్రెషన్ పెట్టింది. ఏదేమైన కార్తీక్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…