Mohan Raj : ఒక సినిమాకి హీరో, హీరోయిన్, కమెడీయన్‌లతో పాటు విలనిజం కూడా చాల ముఖ్యం.ఇండస్ట్రీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి విలన్స్‌గా పేరు తెచ్చుకున్న నటులు చాలా మంది ఉన్నారు. కొందరు విలన్స్ హీరోలకి ధీటుగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అప్పట్లో విలన్స్ కోసం కొందరు స్టార్స్ ప్రత్యేకంగా ఉండేవారు. ఇప్పుడైతే అప్పట్లో హీరోలుగా రాణించిన జగపతి బాబు, శ్రీకాంత్ వంటి వారు విలన్స్ గా నటిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. అయితే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల హవా నడుస్తున్నరోజులలో విలన్స్ చాలా భయంకరంగా ఉండేవారు.
వారిని వెండితెరపై చూసి భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో నటుడు మోహన్ రాజ్ కూడా ఒకరు. నందమూరి బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్ సినిమాలో బాలకృష్ణనే ఢీకొట్టి భీకరమైన విలనిజం పండించిన విలన్ గుడివాడ రాయుడునే మోహన్ రాజ్. తెలుగులో లారీ డ్రైవర్, చినరాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ, శివమణి, శివయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలో నటించి ఎంతగానో మెప్పించాడు. అయితే కొన్నాళ్లుగా ఆయన సినిమాలలో కనిపించడమే మానేశాడు. ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అనే విషయాలు తెలిసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మోహన్ రాజ్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం కాగా, ఆయన దక్షిణాదిలోని అన్ని భాషల్లో పదులకు పైగా చిత్రాల్లో నటించాడు. మలయాళ చిత్రం మొన్నం ములా చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తమిళంలో, తెలుగులో అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించాడు. మలయాళంలో కొన్ని సీరియల్స్‌లో కూడా నటించాడు. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం మధురైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషన్‌గా విధులు నిర్వహిస్తోన్నాడు. మోహన్ రాజ్‌కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు జైష్మ, కావియా సంతానం ఉన్నారు. మోహన్ రాజ్ ఆర్మీలో పని చేయగా, అనంతరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, కేరళ పోలీసు శాఖలో విధులు నిర్వహించి ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగంలో చేరాడు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ.. భార్యాబిడ్డలతో కలిసి మధురైలో జీవనం సాగిస్తున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…