Sai Chand : సాయిచంద్ చ‌నిపోయే ముందు క్ష‌ణాలు.. సీసీటీవీల్లో దృశ్యాలు..

Sai Chand : తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మ‌ర‌ణం చెందాడు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి వెళ్లారు. అర్ధరాత్రి తీవ్ర అస్వస్థకు గురైన సాయిచంద్‌ని నాగర్ కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు..ఆయ‌న‌కి గుండెప‌టు వ‌చ్చిన‌ట్టుగా డాక్టర్లు నిర్థారించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు సాయిచంద్‌ను తరలించారు. గచ్చిబౌలి కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిచంద్‌ కన్నుమూశారు.

సాయి చంద్ మరణంతో బీఆర్ఎస్ శ్రేణుల‌లో తీవ్ర విషాదం అలుముకుంది. సీఎం కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మంత్రి హరీష్‌రావు, బీఆర్ఎస్ నేతలు భావోద్వేగానికి గురయ్యారు. అయితే హాస్పిటల్ ముందు స్ట్రక్చర్ పై సాయి చంద్ ను పడుకోబెట్టి… ఆసుపత్రిలోకి తీసుకువెళ్లే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సాయి చందు భార్య, పిల్లలు రోదిస్తున్న సంఘటన ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియోని చూసిన వారు.. భావోద్వేగానికి గురవుతున్నారు.

Sai Chand last moments before death cctv footage
Sai Chand

తన భ‌ర్త మృతి చెందాడని తెలిసి సాయి చంద్ భార్య గుండెలు ప‌గిలేలా ఏడ్చింది. సాయిచంద్ భార్య రజనీని ఓదార్చడం సిఎం కు కూడా కష్టంగా మారింది. దగ్గరకు వచ్చి రోధిస్తున్న సాయిచంద్ తండ్రిని సీఎం అక్కున చేర్చుకొని ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఓదశలో సాయిచందర్ భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్‌… కంటతడి పెట్టారు. చిన్న వయస్సులో సాయిచంద్‌ మరణం కలచివేసిందని.. ఆయన మరణంతో తెలంగాణ గొప్ప గాయకుడ్ని, కళాకారుడ్ని కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఇక సాయిచంద్… విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటి చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago