Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా వాడివేడిగా సాగుతుంది. అధికారం కోసం పార్టీలు తెగ కుస్తీలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండటంతో యాత్రల పేరుతో ప్రజల మధ్యకు వెళ్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. తామను అధికారంలోకి తెస్తే మీ సమస్యలన్ని పరిష్కరిస్తామంటూ వాగ్దానాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు టీడీపీ నేత, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. 4వేల కిలోమీటర్ల పాదయాత్రలో సుమారు సగభాగం పూర్తి చేసుకోబోతున్నారు లోకేష్.
తాజాగా విద్యార్ధులతో కలిసి ఆయన ముచ్చటించగా, ఓ విద్యార్ధి ఏపీ రాజధాని ఏంటనేది తెలియక చాలా ఇబ్బంది అవుతుంది. దానికి మీరు సమాధానం చెప్పాలని అన్నారు. అయితే జగన్ వలన మద్యం బాగా పెరిగింది కాని, ఇక్కడ డెవలప్‌మెంట్ ఏమి లేదని చెప్పుకొచ్చారు. మీరు ఎవరైన ఏపీ రాజధాని ఏంటో చెబితే లక్షల రూపాయలు ఇస్తా అని లోకేష్ అన్నారు. ఇక యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఏపీ ప్రజలకు లెక్కకు మించిన వాగ్దానాలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే స్వయం ఉపాధి, ప్రైవేట్, ప్రభుత్వ రంగాల ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.
గూడురు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ అక్కడి యువతతో ముఖాముఖి అయ్యారు. కాకువారిపాలెం క్యాంప్ సైట్‌లో విద్యార్ధులు, యువతతో ముచ్చటించిన నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో విద్యార్ధులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి టీడీపీకి పట్టం కట్టాలని యువతను కోరారు లోకేష్. రాష్ట్రంలో వైసీపీ పాలనలో జగన్‌రెడ్డి తన ధనదాహం తీర్చుకోవడానికి ప్రకృతి వనరులను చాలా విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి జగన్ కంస మామగా మారిపోయాడంటూ సంచలన ఆరోపణలు చేశారు లోకేష్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…