Sreeleela : ప్రస్తుతం ఏ సినిమాలో చూసిన మనకు కనిపించే కామన్ హీరోయిన్ శ్రీలీల.బెల్లం చుట్టూ ఈగలు ఎలా మూగుతాయో, ఇప్పడు శ్రీలీల చుట్టూ స్టార్ హీరోలు కూడా అలా తిరుగుతున్నారు. దాదాపు పది సినిమాలను చేత్తో పెట్టుకొని టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది . మరి అందరు ఆమెని ఇష్టపడడానికి కారణం ఆమె తెలుగు చక్కగా మాట్లాడడమే అంటూ తెలుస్తుంది . మన ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లకు సరిగ్గా తెలుగు రాదు ..పక్కవాళ్ళు డబ్బింగ్ చెబుతారు . అయితే శ్రీ లీల బెంగుళూరు బ్యూటీ అయినా సరే తెలుగులో చక్కగా మాట్లాడుతుంది . తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. అంతేకాదు శ్రీ లీల చీర కట్టిన మోడరన్ డ్రెస్ వేసిన రెండిట్లోనూ చాలా అందంగా కనిపిస్తుంది. డ్యాన్స్ తోను అదరగొడుతుంది.
ప్రస్తుతం మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. బాలయ్య.. రామ్ ఇలా వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో అర డజనుకి పైగా సినిమాలు ఉన్న విషయం అందరికి తెల్సిందే. ఛలో కోసం మొదట శ్రీలీల ను సంప్రదించారట. కానీ చివరి నిమిషం లో శ్రీలీల నో చెప్పడంతో చేసేది లేక ఆ స్థానం లో రష్మిక మందన్నా ను హీరోయిన్ గా చేయడం జరిగింది. అదే ఆ సినిమా శ్రీలీల చేసి ఉంటే అప్పుడే ఈ అమ్మడికి స్టార్ డం వచ్చేది. శ్రీ లీలా జూలై 14, 2001లో జన్మించింది. అయితే మొదట కన్నడ భాషలో అడుగుపెట్టి తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదుగుతోంది.
ఇక 21 యేళ్ళ వయసులోనే మాస్ మహారాజ రవితేజ సరసన నటించే అవకాశాన్ని పొందింది.ఇకపోతే అమెరికాలో పుట్టింది బెంగళూరులో పెరిగింది చదువు అంతా కూడా బెంగళూరులోనే పూర్తి చేసింది.కాగా శ్రీ లీలా కి చిన్నతనంలోనే క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం.. చిన్నతనం నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక ఆమెకి ఉండేదట. ఆమె తల్లి కూడా బెంగళూరులో డాక్టర్ గా పనిచేస్తుంది. శ్రీ లీలా జన్మించే సమయానికి స్వర్ణలతకు ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభకరరావుతో విడాకులు జరిగిపోయాయి. తన తల్లి సింగిల్ గా శ్రీ లీలాను పెంచి పెద్ద చేసింది.చదువు పూర్తి చేసుకున్న సమయంలోనే కన్నడ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రావటం మొదలయ్యాయి. ఇక దాంతో మొదటగా 2019లో కిస్ అనే సినిమాలో నటించింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాతో కెరియర్ మలుపు తిరిగింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…