Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన జూన్ 20న పండంటి చిన్నారికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి 2012 జూన్ 24న ఘనంగా జరగగా, వీరి పెళ్లి జరిగిన 11 ఏళ్ళకి ఒక పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఇక రామ్ చరణ్ కూతురిని మెగా ప్రిన్సెస్ అని కొద్ది రోజులుగా పిలుచుకుంటుండగా, చిన్నారికి ఏ పేరు పెడతారని అందరు అనేక ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా వారసురాలి పేరును ఫిక్స్ చేసినట్లు చిరంజీవి స్పష్టం చేశారు.
జూన్ 30న మెగాస్టార్ ఇంట్లో బారసాల కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. తాజాగా తన మనవరాలి పేరు తెలియజేస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు క్లిన్ కారా కొణిదెల అని పెట్టినట్లుగా తెలిపారు. క్లింకారా అనేది లలితాసహస్రనామాల్లో ఒక బీజాక్షం. ప్రకృతికి శక్తికి ప్రతిరూపం అర్థం అని.. ఆ పేరుతో ఒక శక్త, పాజిటివ్ వైబ్రేషన్ ఉందని.. ఈ లక్షణాలని మా లిటిల్ ప్రిన్సెస్ అందిపుచ్చుకొని తన వ్యక్తిత్వతంలో పెరిగేకొద్దీ ఇమడ్చుకుంటుందని నమ్ముతున్నట్లు తెలిపారు. అయితే పాప పేరు చాలా ట్రెండీగా ఉందని, ఇంత భక్తి పారవశ్యం కూడా నెలకొందని చెబుతున్నారు.
నేడు జరిగి బారసాల వేడుక కోసం లక్షల ఖర్చు చేసి ఇంటిని అందంగా అలంకరించారు. బారసాలకి సంబంధించిన ఫొటోలని తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఉపాసన. ఇక 2012లో రామ్ చరణ్-ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో ఘనంగా పెళ్లి చేశారు. పెళ్ళై పదేళ్లు అవుతున్నా రామ్ చరణ్ దంపతులు పేరెంట్స్ కాలేదు. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పదేళ్ల వరకు పిల్లలు వద్దని తాము నిర్ణయించుకున్నట్లు ఉపాసన ఇటీవల వెల్లడించారు. మొత్తానికి వారికి పాప పుట్టడం ఆమెకు పేరు పెట్టి ఆ పేరు రివీల్ చేయడంతో మెగా అభిమానులు సంతోషంగా ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…