Rorschach Movie : ఇటీవల మలయాళ సినిమాలకి మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన రోస్‌చాక్ అనే సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. మమ్ముట్టి నటనకు తోడు సినిమాలోని థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఇప్పటికీ థియేటర్లలో అలరిస్తోన్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో నవంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
మమ్ముట్టి తన సొంత నిర్మాణ సంస్థపై రోస్‌చాక్‌ను నిర్మించాడు. నిశం బషీర్ దర్శకత్వం వహించాడు. మిధున్ ముకుందన్ సంగీతం అందించగా కిరణ్ దాస్ ఎడిటర్‌గా పని చేశాడు. అసిఫ్ అలీ, షరఫ్ ఉధీన్, గ్రేస్ ఆంటోని కీలక పాత్రల్లో నటించారు. ఇక కథ విషయానికొస్తే.. ల్యూక్ ఆంటోని అనే ఎన్‌ఆర్‌ఐ బిజినెస్ మ్యాన్ పాత్రలో మమ్ముట్టి నటించాడు. తన కుటుంబంతో సహా దుబాయ్ నుంచి వెకేషన్ కోసం కేరళకు వస్తాడు. అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో స్పృహ కోల్పోగా, మెలకువ వచ్చాక భార్య పక్కన కనిపించదు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పులి బారిన పడి చనిపోయిందని కేసును మూసివేస్తారు.
కనిపించకుండా పోయిన అతని భార్య చనిపోయిందా? బతికే ఉందా? అని తెలుసుకోవాలంటే రోస్‌చాక్ సినిమాను చూడాల్సిందే. ఇందులో ముమ్మట్టి లూక్ అంటోనిగా కనపడతాడు. ఇందులో ఒక్కో మెలిక వీ డే క్రమంలో రకరకాల అనుభూతులు,అనుభవాలు చోటు చేసుకుంటాయి. తర్వాత ఎన్నో షాకింగ్ సంఘటనలు జరుగుతాయి. అవి ప్రేక్షకుడుని కూర్చోబెడతాయి. ఈ సినిమా రైట్స్ కోసం మన నిర్మాతలు ఉత్సాహపడుతున్నట్లు సమాచారం. ఎక్కువ రేటే చెప్తున్నారని, త్వరలోనే ఓ పెద్ద హీరోతో రీమేక్ చేసే అవకాసం ఉందని అంటున్నారు. ఆ హీరో చిరంజీవి లేక నాగార్జున అనేది తెలియాల్సి ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…