Namitha : 2002 సంవత్సరం సొంతం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నమిత. ఆ తర్వాత జెమినీ చిత్రంలో వెంకటేష్ తో హీరోయిన్ గా నటించిన ఆ చిత్రం పరాజయం కావడంతో ఆమెకు అంత గుర్తింపు దక్కలేదు. నమితకు తెలుగు ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం యంగ్ రెగబస్టార్ ప్రభాస్ నటించిన బిల్లా చిత్రంతోనే అని చెప్పాలి. ఆ తర్వాత 2010 లో నందమూరి బాలకృష్ణ నటించిన సింహ సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కానీ ఆ తర్వాత మన తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు నమిత. ఇక 2017 లో వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న నమిత సినిమాలకు దూరంగా ఉంటుంది. కొన్ని నెలల క్రితమే పండంటి ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చింది నమిత. అయితే నమిత భర్త వీరేంద్ర చౌదరి కూడా నటుడే అనే విషయం మన తెలుగువారిలో చాలా మందికి తెలియదు.
వీరేంద్ర చౌదరి తెలుగులో ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదు. కానీ తమిళ్ లో మాత్రం చాలా సినిమాలు నటించారు. కానీ పెళ్లి తర్వాత ఆయన సినిమాలు కొంచెం దూరంగా ఉంటూ ప్రొడ్యూసింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఆయనను ఓ ఇంటర్వ్యూ లో ప్రశ్నించగా.. నేను ఇప్పుడు కూడా సినిమాలో ఎక్కువగానే నటిస్తున్నాను. ప్రస్తుతం నేను ఆరు సినిమాలలో నటిస్తున్నాను. అందులో కొన్ని సెట్స్ పై ఉండగా మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ ఆరు సినిమాల్లో ఆరు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. కొన్ని సినిమాల్లో విలన్ గా చేస్తే, ఇంకొన్ని సినిమాలో హీరోగా నటిస్తున్నాను అని వీరేంద్ర చెప్పుకుచ్చారు. ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయాలనీ ప్రయత్నిస్తున్నాను. మంచి కథ కోసం వెయిట్ చూస్తున్నాను. మంచి కథ వచ్చిన వెంటనే తెలుగులో తప్పకుండా సినిమా చేస్తా. ఇక నమితతో కలిసి చేయడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తనకు జోడిగా చేయమన్న ఓకే. లేదా తనకు వ్యతిరేకంగా నైనా సరే ఎలా అయిన నాకు సెట్ అయ్యే పాత్రలో తప్పకుండ నటిస్తా అని వీరేంద్ర చౌదరి ఇంటర్వ్యూ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…