Roja : ఏపీ రాజకీయాలు రోజురోజుకి మరింత రంజుగా మారుతున్నాయి. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి దారుణమైన కామెంట్స్ చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు చిరంజీవిని విమర్శిస్తున్నారు. వాల్తేరు వీరయ్య ఈవెంట్‌లో చిరంజీవి.. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ కి ఇప్పుడు వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి కామెంట్స్ పై కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, అమర్‌నాథ్ వంటి వారు దారుణంగా స్పందించారు. ఇక తాజాగా రోజా మాట్లాడుతూ.. చిరంజీవి చెబితే పని చేసే పరిస్థితుల్లో జగన్ లేడని అన్నారు.
గడపగడపకూ వచ్చి చూస్తే తమ ప్రభుత్వం రోడ్లు వేసిందో? లేదో? తెలుస్తుందన్నారు. చిరంజీవికి ఏం అర్హత ఉందని సినిమా టిక్కెట్ ధరలు పెంచమని అడిగారని నిలదీశారు. హీరోలందరూ కలిసి జగన్ దగ్గరకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించలేదని, పవన్ కల్యాణ్, చిరంజీవి మాత్రమే ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తమ్ముడు పవన్ కోసం చిరంజీవి మాట్లాడి ఉంటారని..మెగ్రా బ్రదర్స్ కలిసి వస్తేనే ప్రజలు తిరస్కరించారని గుర్తు చేసారు. కేంద్ర మంత్రిగా చిరంజీవి ఏపీకి ఏం చేసారని రోజా నిలదీసారు. పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి రాష్ట్రానికి ఏం చేసారని ప్రశ్నించారు.
ఏపీకి ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా అని రోజా నిలదీసారు. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడ లేదో చిరంజీవి చెప్పాలన్నారు. జగన్ మీద నమ్మకం లేకపోతే హీరోలు అందరినీ తీసుకొని చిరంజీవి సీఎం దగ్గరకు ఎందుకు వెళ్లినట్లని ఆమె ప్రశ్నించారు. చర్చకు తాను సిద్దమని చిరంజీవికి సవాల్ చేసారు రోజా. చిరంజీవికి తమ్ముడు మీద ప్రేమ ఎక్కువై అలా మాట్లాడి ఉంటారని రోజా పేర్కొన్నారు. తమ్ముడికి బలం ఇచ్చేందుకు ఆ కామెంట్స్ చేసి ఉంటారన్నారు. గతంలో పార్టీ పెట్టి నమ్ముకున్న వాళ్లను రోడ్డు పైన వదిలేసి వాళ్లు సినిమాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వాళ్లు నమ్మకం కోల్పోయారని విశ్లేషించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా మరోసారి తిరస్కరణ తప్పదని రోజా పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…